వెంకీ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడుvenky
2019-10-22 05:14:53

గత కొన్నేళ్లగా సక్సెస్ లేని సీనియర్ హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ తోడుగా చేసిన ‘ఎఫ్2’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో వెంకటేష్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు వెంకీ బాబీ దర్శకత్వంలో మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వెంకటేష్.. ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలను డైరెక్ట్ చేసిన విలక్షణ దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లోనే ఉండబోతోన్న ఈ మూవీలో వెంకటేష్ మలక్ పేట్ లోని రేస్ క్లబ్ లో పంటర్ పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు కొంతకాలంగా నిపిస్తున్నాయి. ఇది ఇప్పటి వరకూ వెంకీ చేయని ఓ డిఫరెంట్ క్యారెక్టర్ అంటున్నారు. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రంలో ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ సినిమాలో నటించనున్నాడట. రీసెంట్ గా రజినీకాంత్ పేటా సినిమాలోనూ విలన్ పాత్రలో నటించాడు. ఇక వెంకీ సినిమాలో ఆయనకి కీలకమైన పాత్రను ఆఫర్ చేశారట. ఇదే నిజమైతే బొమన్ ఇరానీ, జాకీ ష్రాఫ్ లాంటి వారి తర్వాత తెలుగు సినిమా మరో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ను చూడబోతున్నట్టేనన్న మాట.

 

More Related Stories