చిరంజీవికి అవమానం.. సైరా ప్రమోషన్స్ పట్టించుకోని నయనతార.. Nayanthara
2019-08-23 11:45:07

నయనతారకు ముందు నుంచి కూడా ఇండస్ట్రీలో ఓ చెడ్డ పేరు ఉంది. సినిమాలు ఎంత బాగా చేసినా.. ఎంత అద్భుతంగా నటించినా కూడా ప్రమోషన్స్ వైపు మాత్రం రాదని. ముందు నుంచి కూడా చాలా మంది దర్శక నిర్మాతలు ఈ విషయంపై ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసారు కానీ ఇప్పటికీ మారలేదు.. ఇక మారదు కూడా. ఇప్పుడు సైరాకు కూడా ఇదే సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి. సైరా సినిమా ప్రమోషన్స్ కు కూడా నయన్ రానట్లే. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో ఇప్పట్నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టారు యూనిట్. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ మధ్యే ముంబైలో జరిగిన సైరా టీజర్ లాంఛ్ ఈవెంట్ కు నయనతార రాలేదు. ప్రస్తుతం ఈమె రజినీకాంత్ దర్బార్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉంది. దుబాయ్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. అక్కడ బిజీగా ఉంది కాబట్టి ఇక్కడికి రాలేదనుకున్నారు కానీ అక్కడ వచ్చే వీలున్నా కూడా ఇక్కడికి రాలేదని తర్వాత తెలిసింది. నయనతార ముందు నుంచే తాను సైరా ప్రమోషన్స్ కు రాలేనని చెబుతూనే ఉంది. అసలు చిరంజీవి కాదు.. హీరో ఎవరైనా కూడా ఆమె ప్రమోషన్స్ కు రాదు. తనకు ప్రమోషన్స్ కోసం కూడా ఎక్స్ ట్రా రెమ్యునరేషన్ ఇస్తే కానీ రానని ముందు నుంచి చెబుతున్న మాట. అయితే ఇప్పుడు అలా చేసినా కూడా ఈమె వచ్చేలా కనిపించడం లేదు. చిరంజీవి అయినా.. మరే హీరో అయినా కూడా తాను ప్రమోషన్స్‌కు దూరమే అంటుంది నయనతార. సైరా లాంటి సినిమా చేసినపుడు కచ్చితంగా ప్రమోషన్స్ కు కూడా రావాల్సిందే. కానీ నయనతార మాత్రం ప్రమోషన్స్ నాకు అవసరం లేదని చెబుతుంది.  
 

More Related Stories