దీపికా పదుకొనే మేనేజర్ కు NCP నోటీసులు..Deepika Padukone
2020-09-22 21:16:36

బాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా అంతుచిక్కని విషయం. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నుంచి మొదలై అనేక మలుపులు తిరిగి చివరికి అది డ్రగ్స్ కుంభకోణం దగ్గర వచ్చి ఆగింది. ఇందులో రియా చక్రవర్తి ప్రధాన సూత్రధారి అని ఇప్పటికే బయటకు వచ్చేసింది. ఆమెతో పాటు ఇంకా చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ కేసును ఉన్నారని నార్కోటిక్స్ అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు కన్నడ ఇండస్ట్రీని కూడా డ్రగ్స్ కుంభకోణం ఊపేస్తోంది. అక్కడ చాలా మంది ప్రముఖులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రాగిణి ద్వివేది, సంజన లాంటి హీరోయిన్లు జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామందికి సమన్లు కూడా జారీ చేశారు. ఇప్పటికే ఎంతోమంది నార్కోటిక్స్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.

రియా చక్రవర్తి రెండు మూడుసార్లు అధికారులకు చాలా కీలకమైన సమాచారం ఇచ్చింది. ఆమె సోదరుడు కూడా కస్టడీలోనే ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్లో మరో ప్రముఖుడి కూడా ncp సమన్లు జారీ చేసింది. దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ కు నార్కోటిక్స్ అధికారులు సమన్లు జారీ చేశారు. త్వరలోనే విచారణకు రావాలంటూ ఆదేశించారు. వీళ్లు మాత్రమే కాదు సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా చాలా మందికి ఆయన నార్కోటిక్స్ అధికారులు నోటీసులు జారీ చేసేలా కనిపిస్తున్నారు. ఈ వారం రోజుల్లోనే అందరూ విచారణకు హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీళ్లందరి నుంచి సమాచారం తీసుకున్న తర్వాత కేసులో ఇంకా ఎంతమంది ఉన్నారనేది బయటకు వస్తుంది. 

More Related Stories