సైరా టీజర్ లో అదొక్కటే మైనస్ అంటున్నారే.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?Sye Raa Narasimha Reddy
2019-08-21 17:37:36

సైరా టీజర్ విడుదలై సంచలనాలు సృష్టిస్తుంది. 24 గంటలు కూడా గడవకముందే చాలా రికార్డులకు తెరతీసాడు చిరంజీవి. ఇదిలా ఉంటే ఇప్పుడు సైరా టీజర్ చూసిన తర్వాత ప్లస్ లతో పాటు కొన్ని మైనస్ లు కూడా బయట పడుతున్నాయి. ఇప్పటి వరకు చిరంజీవి లుక్ ఏ టీజర్ లో, మేకింగ్ వీడియోలో బయటికి రాలేదు. కానీ ఇప్పడు విడుదలైన టీజర్ లో కనిపించాడు మెగాస్టార్. దాంతో యాంటీ ఫ్యాన్స్ కు మంచి ఆయుధం దొరికినట్లయింది. టీజర్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా అదుర్స్ అనిపించాయి. కానీ చిరంజీవి లుక్ విషయంలో మాత్రం మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండుంటే బాగుండేదంటున్నారు విశ్లేషకులు. సైరాకు చిరు లుక్ ఒక్కటే కాస్త మైనస్ అయిపోయిందని చెబుతున్నారు. అసలు సైరాలో చిరంజీవి తప్ప అందరూ బాగున్నారంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఈ విషయంలో ట్రోలింగ్ మరీ ఎక్కువ అయిపోతుండటంతో మెగా ఫ్యాన్స్ కు మండిపోతుంది. ఎందుకు తమ హీరోను అలా టార్గెట్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. నిజానికి టీజర్ లో చిరంజీవి కనిపించిన విధానం అదిరిపోయింది. అసలు ఈ వయసులో కూడా ఆయన చేసిన ఫీట్స్ కానీ.. యుద్ధ సన్నివేశాలు కానీ.. కత్తి సాము కానీ అన్నీ అదిరిపోయాయి. కానీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం చిరంజీవిని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎవరు ఔనాన్నా కాదన్నా ఈ ఏజ్ లో సైరా లాంటి సినిమా చిరంజీవి చేయాలనుకోవడం కాస్త సాహసమే. కానీ వయసును దాటి సైరాతో చాలా ప్రభంజనాలు సృష్టిస్తున్నాడు మెగాస్టార్. అక్టోబర్ 2న ఈ చిత్రం 5 భాషల్లో విడుదల కానుంది. వచ్చిన తర్వాత కచ్చితంగా రికార్డులు తిరగరాయడం కూడా ఖాయంగా కనిపిస్తుంది.

More Related Stories