శేఖర్‌ మాస్టర్‌ రోజాలపై నెటిజన్‌ ఫైర్..Sekhar master Roja
2020-03-21 21:06:52

టీవీ షోల్లో జబర్దస్త్‌కు ముందు నుండీ ప్రత్యేక స్థానం ఉంది. తెలుగులో ఎన్ని కామెడీ షోలు వచ్చినా ఎక్కువ కాలం అవి కొనసాగలేదు. కానీ జబరదస్త్‌ మాత్రం సంత్సరాల తరబడి రేటింగ్‌లో దూసుకుపోతుంది. ఈ షోలో మొదట ధన్‌రాజ్‌, వేణు, చంద్ర స్క్రిట్‌లు హైలెట్‌గా నిలిచి జబర్‌దస్త్‌కు ఓ క్రేజ్‌ను తెచ్చి పెట్టాయి. కాగా ఆ తరువాత వీరు సినిమాల్లో బిజీ అవ్వడంతో జబర్‌దస్త్‌కు స్వస్తి చెప్పారు. ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన హైపర్‌ ఆది పంచ్‌లతో జబర్‌దస్త్‌ క్రేజ్‌ మరింత పెరిగింది. జబర్‌దస్త్‌లో వచ్చిన ఇద్దరు యాంకర్‌లు కూడా షో సూపర్‌ హిట్‌ కావడంలో ముఖ్యపాత్ర పోషించారు. ముందుగా ఈ షోలో అనసూయ మాత్రమే రాగా ఆ తరువాత ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ అనే ఎపిసోడ్స్‌ ప్రారంభించి రష్మి, అనసూయలు యాంకరింగ్‌ చేశారు.

ఇదిలా ఉండగా జబర్దస్త్‌లో నవ్వుల నాగబాబు మరియు రోజా గారు కూడా మూల స్థంబాలుగా ఉండేవారు. షో మధ్యలో వారు కూడా పంచ్ లు వేస్తుడండం అప్పుడప్పుడు స్కిట్‌లో ఎవరైనా తప్పు చేస్తే కోప్పడటం చేసేవారు. కాగా ప్రస్తుతం నాగబాబు స్థానంలో జడ్జిగా శేఖర్‌ మాస్టర్‌ వస్తున్నారు. అయితే ముందు నుండి రోజా, శేఖర్‌ మాస్టర్‌తో కొన్ని షోల్లో స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంటుందని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు. కాగా ఇప్పుడు వీరు షోలో చేసే డాన్సులు దానిలో భాగంగా చేసే రొమాన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఏ పండగ వచ్చినా జబర్దస్త్‌ ముందు నుండి ఓ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. దీంతో ఉగాది పండగ కానుకగా "పండగ సార్ పండగ అంతే'' అనే ఓ ఈవెంట్‌ను షూట్‌ చేసింది. కాగా దీనికి సంభందించిన ప్రోమో విడుదలచేయగా అందులో రోజా శేఖర్‌ మాస్టర్‌లు మైండ్‌బ్లాక్‌ పాటకు వేసిన స్టెప్పులకు ఓ నెటిజన్‌ మైండ్‌బ్లాక్‌ అయ్యే రేంజ్‌లో కామెంట్‌లు పెట్టాడు. అసలు మీ స్థాయి ఏంటి మీరు వేస్తున్న స్టెప్పులేంటని ప్రశ్నించాడు. మీరు వేసుకున్న దుస్తులు అసలు మీకు సూట్‌ కాలేదంటూ కామెంట్ చేశాడు. ఏది ఏమైనా పండగ సార్‌ పండగ అంతే ప్రోగ్రాం మాత్రం టాప్‌ రేటింగ్‌లో దూసుకుపోయేలా కనిపిస్తోంది.

More Related Stories