దేశం అందరిదీ ఒక బాధ..అనసూయది మరో బాధanasuya
2020-03-26 14:27:41

దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా అనసూయది మరో సమస్య అన్నట్టు ఉంది. దేశం మొత్తం కరోనాతో బాధ పడుతుంది. ఏకంగా ఇరవై ఒక్కరోజుల పాటు లాక్ డౌన్ కూడా ప్రకటించింది భారత ప్రభుత్వం. కానీ ఈమెను అసభ్యంగా వేదిస్తున్నారట ఎవరో. దీంతో ఆవిడ అసభ్యంగా రాసిన ఆ రాతలను సైబర్ క్రైం పోలీసులకి ట్యాగ్ చేసింది. సదరు పోస్టును పరిశీలించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆ పోస్టును తొలగించారు. అయితే మొన్నీమధ్య ఆమె చేసిన ఒక ట్వీట్ చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. ముందు కేసీఆర్ ఈ నెల ఆఖరు వరకూ లాక్ డౌన్ ప్రకటించారు.

ఈ విషయాన్ని కేటీఆర్ ట్వీట్ చేయగానే అనసూయ ఇంకేముంది ఇన్ని రోజులు ఇలా లాక్ డౌన్ చేస్తే మాబోటి వాళ్ళు ఏమి పోవాలి ? రోజూ పనికి వెళ్తేనే నెల తిరిగే సరికి ఈఎంఐలు లాంటివి కట్టుకోగలం అని బీద అరుపులు అరవడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున ఆమె మీద దండయాత్ర చేశారు. అయినా ఆమె కూడా ఎక్కడా తగ్గలేదు తాను మాట్లాడింది కరెక్టే అని చెబుతూ తన మీద కామెంట్ చేసిన అందరినీ బ్లాక్ చేస్తూ కూర్చుంది. ఇక ఇలా తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నారంటూ ఈ ముదురు భామ పోలీసులను ఆశ్రయించడం ఇదేమీ కొత్త కాదు.

 

More Related Stories