నిన్న కరోనాకి ఆల్ ది బెస్ట్ చెప్పింది...ఇప్పుడు సారీ చెబుతోంది !kaur
2020-03-04 02:24:05

పిచ్చి పలు రకాలు అంటే ఏంటో అనుకునే వాళ్ళం ఇంతకు ముందు. టిక్‌టాక్ పుణ్యమా అని ఈ మధ్య అలాంటి సంఘటనలు నిత్యం చూడాల్సి వస్తుంది. టాలీవుడ్ అమ్మడి నిర్వాకంతో ఇది మరోసారి రుజువైంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై ఛార్మి చేసిన టిక్‌టాక్‌.. నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది. దీంతో ఆమె ఆ వీడియో డిలిట్ చేసి.. క్షమాపణలు చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అనే ఈ మహమ్మారి ఇప్పుడు తెలంగాణలోనూ ప్రత్యక్షమైంది. అందరూ ఎంతో ఆందోళన చెందుతున్న తరుణంలో సినీ నటి, నిర్మాత చార్మీ కాస్త వెటకారం జోడించి పోస్టు చేసింది. కరోనా ఇక్కడికి కూడా వచ్చేసిందట కదా, ఆల్ ది బెస్ట్ అంటూ వైరస్ కు స్వాగతం పలుకుతున్నట్టు ఓ టిక్ టాక్ వీడియో చేసింది. ఆఫీసులో కూర్చున్న ఆమె.. తన దగ్గరికొచ్చిన కెమెరావైపు చూస్తూ.. ''ఆల్ ది బెస్ట్ గాయ్స్.. ఎందుకో తెలుసా? కరోనా వైరస్ తెలంగాణ, ఢిల్లీకి వ్యాపించిందంట. ఇప్పుడే వార్తల్లో చూశాను. వావ్.. అందరికీ ఆల్ ది బెస్ట్..'' అని అన్నారు. నిమిషాల్లో ఆ వీడియో వైరల్ అయింది.

ఆమె చేసిన వీడియో కాస్తా పెద్ద దుమారాన్నే రేపింది. జనం ఒక వైపు చస్తుంటే కనీస మానవత్వం లేకుండా కరోనాకు వెల్కమ్ చెబుతావా..? అంటూ ఆమెపై తిట్ల వర్షం మొదలుపెట్టారు నెటిజన్లు. ఆపదలో ఉన్నవారికి చేతనైతే సాయం చేయాలని, ఇలా చేయకూడదని హితవు పలికారు. చార్మి కామెంట్లు వెకిలిగా ఉన్నాయని, ఆమె దిమాక్ ఖరాబ్ అయిందని ఫైర్‌ అయ్యారు. అవతల వేల మంది ప్రాణాలు పోతూ, ఆర్థిక రంగాన్ని సైతం అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ గురించి ఇంత దారుణంగా మాట్లాడటమేంటని చార్మిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోపై పెద్ద దుమారమే చెలరేగడంతో.. వెంటనే దాన్ని డిలీట్ చేసిందీ అమ్మడు. అయినా.. నెటిజన్లు సర్ధుకోలేదు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానిపై ట్విట్టర్ లో స్పందించిన చార్మీ, జరిగిన దానిపై క్షమాపణలు కోరింది. వీడియో పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ పోస్టయిన అన్ని కామెంట్లు చదివాను. ఎంతో సున్నితమైన అంశంపై పరిణతి లేకుండా స్పందించినందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. ఇకపై ఇలాంటి పొరబాట్లు జరగకుండా జాగ్రత్త వహిస్తాను" అంటూ చార్మీ ట్వీట్ చేసింది.

More Related Stories