కొత్త వ్యాపారంలోకి కంగనKangana Rananaut.jpg
2019-10-18 09:41:38

ఆమె ఒక మోనార్క్, వివాదాలంటే ఆమెకి ఇష్టమో ఆమంటే వివాదాలకి ఇష్టమో తెలీదు కానీ తాను నడిచేది, నడిపించేది వివాదాలనే. దీంతో హీరోలేమో దగ్గరకు రానివ్వడం లేదు. ఇక సినిమా చేయాలనుకున్న నిర్మాతలేమో కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా హడలిపోతున్నారు. దీంతో హీరోయిన్‌గా ట్రై చెయ్యడం మాసేని కొత్త బిజినెస్ లోకి దిగిపోయింది కంగన రనౌత్. మణికర్ణిక ఫిల్మ్స్‌ అనే బ్యానర్ స్టార్ట్ చేస్తోంది కంగన. కంగన రనౌత్‌ లిస్ట్ లో బెస్ట్ పెర్ఫామెన్సులు ఎన్ని ఉన్నాయంటే ఎవరికీ గుర్తుండదు. 

కానీ ఈమె చేసిన రచ్చ గురించి చెప్పమంటే గంటలకొద్దీ చెబుతూనే ఉంటారు బీ టౌన్ జనాలు. ఆ రేంజ్‌ వివాదాల ట్రాక్ రికార్డ్ ఈమె సొంతం. హృతిక్ రోషన్‌ నుంచి మొదలు పెడితే క్రిష్, తాప్సీ వరకు కంగన బాధితులు చాలా మంది ఉన్నారు. ఈ బాధితులను చూసే, బాలీవుడ్ జనాలు ఈమెను దూరం పెడుతున్నారు. బాలీవుడ్ జనాలు కంగన రనౌత్‌ని ఎంత నెట్టేస్తున్నా, ఈమె మాత్రం వదల బొమ్మాళీ వదల అన్నట్లు బీటౌన్‌కి అతుక్కుపోతోంది. 

మీరు సినిమాల్లో అవకాశాలు ఇవ్వకపోతే ఏంటి నేనే సినిమాలు తీస్తా..రీలీజ్ చేస్తా.. అంటూ ప్రొడక్షన్ కంపెనీ పెడుతోంది బాలీవుడ్. మణికర్ణిక ఫిల్మ్స్‌ అనే బ్యానర్ స్టార్ట్ చేస్తోంది కంగన. ఈ కంపెనీలో కొత్తోళ్లతో చిన్న సినిమాలు నిర్మిస్తుందట. అయితే కంగన కంపెనీ పెట్టడంపై బాలీవుడ్‌ సెటైర్లు వేస్తోంది. కంగనకి గొడవల దెబ్బకి ఎవరూ ఈమెకు అవకాశాలు ఇవ్వరు. అందుకే నిర్మాతగా మారుతోంది. దీనికి కొత్త పులకరింతలు ఎంకరేజ్‌మెంట్‌.. అని కలరింగ్ ఇస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

More Related Stories