మహేష్ బన్నీ...దిల్ రాజుకు కొత్త తలనొప్పిDil Raju
2019-12-26 22:30:37

మింగమంటే కప్పకి కోపం వదలమంటే పాముకు కోపం అనే సామెత ప్రస్తుతం దిల్ రాజుకు చక్కగా సరిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్ లో హిట్ కొట్టి ఎంతో కొంత వెనక వేసుకుందాం అనే ఆలోచనలో ఉంటాడు. ఈ ఏడాది అదృష్టమో దురదృష్టమో ఒక సినిమా నిర్మించగా మరో సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం వచ్చింది. అదేంటంటే సంక్రాంతికి విడుదల కాబోతున్న 'అల వైకుంఠపురములో' 'సరిలేరు నీకెవ్వరు' రెండు సినిమాల వెనుక దిల్ రాజ్ హస్తం ఉంది. బన్నీ సినిమాకు దిల్ రాజ్ డిస్ట్రిబ్యూటర్ అయితే మహేష్ సినిమాకు దిల్ రాజ్ సహ నిర్మాత. ఒక రోజు తేడాతో ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో మహేష్, బన్నీల మార్కెటింగ్ వాళ్ళు దిల్ రాజ్ కి పంపుతున్న థియేటర్ రిక్వైర్మెంట్ లు చూసి మెంటల్ ఎక్కుతుందట. ఎందుకంటే ముందుగ జనవరి 11న 'సరిలేరు నీకెవ్వరు' విడుదల కాబోతోంది. ఆ సినిమాకు సంబంధించి భాగ్యనగరానికి సంబంధించిన మంచి ధియేటర్లు మాత్రమే కాకుండా నైజాంలో ధియేటర్స్ లో సింహ భాగం తమకే కావాలని మహేష్ టీమ్ పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. అయితే రెండో రోజే బన్నీ సినిమా ఉండడంతో ఆ సినిమా కూడా దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో ఒక్క ధియేటర్ లో కూడా తమ హీరో సినిమా తీసివేయడానికి ఒప్పుకోమని చెబుతున్నారట. ఆ విషయం బన్నీ మార్కెటింగ్ టీం చెవిలో పాడడంతో నిజాంలోని ధియేటర్స్ లో సింహ భాగం తమకే కావాలని అడుగుతున్నారట వాళ్ళు. దీంతో అనవసరంగా రెండు సినిమాలు నెత్తిన వేసుకున్నానని దిల్ రాజు బాధ పడుతున్నాడని టాక్.

More Related Stories