35 సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్న నిధి అగ‌ర్వాల్ 



Nidhhi Agerwal
2021-03-31 13:58:31

క‌రోనా లాక్ డౌన్ త‌ర‌వాత సెల‌బ్రెటీలు అంతా క‌రోనా టెస్ట్ చేయించుకుని తిరిగి షూటింగ్ ల‌కు హాజ‌రౌతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే చాలా మంది టెస్టులు చేయించుకున్నారు. అయితే హాట్ బ్యూటీ నిధి అగ‌ర్వాల్ ఏకంగా 35 సార్లు క‌రోనా టెస్ట్ చేయించుకుంద‌ట‌. ఈ విష‌యం గురించి నిధి అగ‌ర్వాల్ చెబుతూ...ఫ‌స్ట్ టైమ్ కోవిడ్ టెస్ట్ చేయించుకున్న స‌మ‌యంలో అసౌక‌ర్యంగా అనిపించింద‌ని తెలిపింది. కానీ త‌ర్వాత అల‌వాటు ప‌డ్డాన‌ని గ‌త అక్టోబ‌ర్ నుండి షూటింగ్ లో పాల్గొంటున్న‌ట్టు వెల్ల‌డించింది. 

అంతే కాకుండా ప్ర‌స్తుతం చేస్తున్న సినిమాల కోసం హైద‌రాబాద్, బెంగుళూర్, చెన్నై మ‌ధ్య తిరుగుతున్నట్టు తెలిపింది. జ‌ర్నీ చేసిన ప్ర‌తిసారి కోవిడ్ టెస్టె చేయించుకుంటున్న‌ట్టు పేర్కొంది. అలా ఇప్ప‌టివ‌ర‌కూ 35 సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నానని నిధి అగ‌ర్వాల్ వెల్ల‌డించింది. ఇదిలా ఉండగా నిధి అగ‌ర్వాల్ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో రామ్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించి ఇస్మార్ట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర‌వాత నిధి వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమాలో హీరోయిన్ గా న‌టించే ఛాన్స్ కొట్టేసింది. 

More Related Stories