నాగ చైతన్య పక్కా ఖిలాడీ.. నన్ను పడేసాడంటున్న హీరోయిన్.. Nidhhi Agerwal
2019-10-24 12:52:17

మంచు లక్ష్మి ఫీట్ అప్ విత్ ది స్టార్స్ షో ఇప్పుడు తెలుగు డిజిటల్ రంగంలో సంచలనాలు సృష్టిస్తుంది. ఇందులోకి వస్తున్న సెలెబ్రిటీస్ తమ జీవితంలో జరిగిన చాలా విషయాల గురించి ఓపెన్ అవుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు కూడా చెబుతున్నారు. బెడ్రూమ్ లో జరిగిన విషయాలను కూడా మీడియా ముందు పెడుతుంది మంచు లక్ష్మి. సమంత, రకుల్, వరుణ్ తేజ్, నిఖిల్ ఇలా చాలా మంది ఇప్పటికే ఈ షోకు వచ్చారు. ఈ మధ్యే వచ్చిన నిధి అగర్వాల్ కూడా ఇదే చేసింది. ఈమె కూడా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది. 

ముఖ్యంగా తన లవ్.. తర్వాత బ్రేకప్.. ఇప్పుడు సింగిల్ అనే విషయం అన్నీ చెప్పింది. దాంతో పాటు క్రికెటర్ కేఎల్ రాహుల్ తో ఉన్న పరిచయం.. ఎఫైర్ న్యూస్ పై కూడా క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దాంతో పాటు నాగ చైతన్య సెట్స్ లో ఎలా ఉంటాడు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చింది నిధి. ఈ ఇద్దరూ కలిసి చందూ మొండేటి తెరకెక్కించిన 'సవ్యసాచి' లో నటించారు. ఈ షూటింగ్ సందర్బంగా జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది నిధి. పైకి చూడ్డానికి హీరో నాగ చైతన్య చాలా రిజర్డ్వ్ గా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం చాలా చిలిపి అంటుంది ఈ ముద్దుగుమ్మ. 

సవ్యసాచి సమయంలో దర్శకుడు చందు మొండేటి, హీరో నాగ చైతన్య కలిసి చేసిన పనికి తన మూతి పగిలిందని చెప్పింది నిధి అగర్వాల్. ఈ ఇద్దరూ కలిసి తన రెండు షూ లేస్ ముడేశారని.. అది తెలియక కింద పడితే మొహం పగిలేదని చెప్పింది. ఎందుకు ఇలా చేసారని అడిగితే ఇలా అయితే షూటింగ్ క్యాన్సిల్ అవుతుందని చిలిపి సమాధానం ఇచ్చారని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ. నాగ చైతన్య చేసిన ఈ చిలిపి పనితో నిజంగానే నిధి అగర్వాల్ మొహం పగిలేది.. కానీ తృటిలో తప్పించుకున్నానని చెప్పింది. మొత్తానికి నాగ చైతన్య రియల్ బిహేవియర్ ఇలా ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. 

More Related Stories