ఓటీటీ లో ఇస్మార్ట్ బ్యూటీ సినిమాNidhhi Agerwal
2020-09-30 11:18:18

బాలీవుడ్ నుండి టాలివుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్ ఇప్పుడు టాప్ హీరోయిన్ ల లిస్టులో చేరిపోయింది. నిది అగర్వాల్ మొదట మొదట సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాగా ఆ తరవాత మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల సరసన ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఆ తరవాత నిధి పురిజగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సీనుమాలో నటించింది. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడం, సినిమాలో నిధి తన అందాలను ఆరబోయడం తో కుర్రాళ్ళ మదిలో నిధి స్థానం సంపాదించుకుంది. మరోవైపు నిధి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో కుర్రకారును ఆకర్షిస్తూ ఉంటోంది. 

ఇదిలా ఉండగా నిధి టాలీవుడ్ నుండి కోలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. తమిళ్ జయం రవి తో కలిసి భూమి అనే సినిమాలో నటించింది. కాగా కరోనా లాక్ డౌన్ కి ముందు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లు మూసి ఉండటంతో ఇప్పటివరకూ విడుదలకి నోచుకోలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. హాట్ స్టార్ ఇచ్చిన ఆఫర్ కు చిత్ర యూనిట్ మొగ్గుచూపుతున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక హాట్ బ్యూటీ అందాలను చూడటానికి అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

More Related Stories