టాలీవుడ్ హీరోతో డేటింగ్...క్లారిటీ ఇచ్చిన ఇస్మార్ట్ బ్యూటీNidhi Agarwal
2020-10-24 10:19:56

సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్. ఆ తరవాత ఈ బ్యూటీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన "మిస్టర్ మజ్ను" లో యంగ్ హీరో అఖిల్ అక్కినేని సరసన నటించి మెప్పించింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. దాంతో నిధి అగర్వాల్ కూడా పెద్దగా ఫోకస్ అవ్వలేదు. ఆ తరవాత క్రేజీ డైరెక్టర్ పురిజగన్నాథ్ కంటిలో నిధి అగర్వాల్ పడటంతో ఆమె గ్రాఫ్ మారిపోయింది. రామ్ పోతినేని హీరోగా పూరి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తీశారు. ఈ సినిమాలో రామ్ సరసన నిధి హీరోయిన్ గా నటించింది. ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో నిధి అగర్వాల్ టాలీవుడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోలతో యువత మతిపోగొడుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఇస్మార్ట్ బ్యూటీ ఓ టాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కాగా ఇటీవల నిది హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరుకాగా మీడియా కూడా అదే అంశం పై ప్రశ్నించింది. దాంతో తాను ప్రస్తుతం ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని సింగిల్ గానే ఉన్నానని నిధి అగర్వాల్ స్పష్టం చేసింది. నిధి మీడియాకు ఇచ్చిన సమాధానంతో కొంతకాలంగా ఆమెపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది. ఇక ఇప్పడు ఈ భామ తెలుగు తో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బిజిగా ఉంది. తెలుగులో రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వస్తోన్న ఓ సినిమాలో నటించనుంది.

More Related Stories