నా రొమాన్స్ త్వరలోనే చూస్తారంటున్న నిహారిక కొణిదెల..Niharika Konidela
2020-04-22 23:33:36

నిహారిక కొణిదెల.. పరిచయం అక్కర్లేని పేరు. మెగా కుటుంబం నుంచి అప్పటి వరకు కేవలం హీరోలు మాత్రమే వచ్చారు. కానీ ఒక మంచి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న కూడా ఇప్పటి వరకు హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేదు నిహారిక. ఈమె నటించిన అన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఒక మనసు తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసింది. ఆ తర్వాత చిరంజీవి సైరాలో చిన్న పాత్రలో నటించింది నిహారిక. కొంత కాలంగా సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా లాక్ డౌన్ సందర్భంగా ఆమె యాంకర్ రవితో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చింది. అక్కడ ప్రేక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం చెప్పింది నిహారిక. 

తన అభిప్రాయాలను ఉన్నదున్నట్లు అభిమానులతో పంచుకుంది. పెళ్లి తర్వాత నటిస్తారా అని నెటిజన్లు ప్రశ్నించగా ఆమె వెంటనే తానేమీ సమంత కాదని.. తనకు అంత క్రేజ్ లేదని ఒప్పుకుంది. పెళ్లి తర్వాత నటించే విషయమై ఇప్పటికిప్పుడు చెప్పలేనని తేల్చి చెప్పింది నిహారిక. కానీ మంచి పాత్రలు వచ్చినప్పుడు.. తన కోసం దర్శకులు అడిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా నటిస్తానని చెప్పుకొచ్చింది నిహారిక కొణిదెల. ఇక తాను గ్లామర్ పాత్రలకు కూడా సిద్ధమవుతున్నట్లు చెప్పింది ఈమె.  త్వరలోనే అతను గ్లామరస్ పాత్రల్లో కూడా చూస్తారని క్లారిటీ ఇచ్చింది నిహారిక. తన రాబోయే తమిళ ప్రాజెక్ట్ రొమాంటిక్ చిత్రంగా తెరకెక్కనున్నట్టు కన్ఫమ్ చేసింది కొణిదెల వారమ్మాయి. ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ తర్వాత గోవాలో రొమాంటిక్ సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్టు చెప్పింది నిహారిక. ఇప్పటికే మూడేళ్ల కింద విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ఓ సినిమాలో నిహారిక నటించింది.

More Related Stories