నిహారిక పెళ్లికి ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వస్తున్నారో తెలుసా..



Niharika Konidela
2020-12-05 14:51:27

తెలుగు ఇండస్ట్రీ అంతా ఇప్పుడు నిహారిక పెళ్లి గురించి మాట్లాడుకుంటుంది. డిసెంబర్ 9న పెళ్లి ఉదయ్ పూర్ లో ఘనంగా జరగబోతుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దానికి తోడు మెగా హీరోలు కూడా తమ సినిమా షూటింగ్ లను వాయిదా వేసుకుని నిహారిక పెళ్లి కోసం సిద్ధమవుతున్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఈ పెళ్లి జరగనుంది అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో నిహారిక, చైతన్య జొన్నలగడ్డ ఒకటి కాబోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ జంటకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. నిశ్చితార్థం తర్వాత కలిసి ఫోటోలు దిగడం బయటకు పార్టీలకు వెళ్లడం ఇలా ఎక్కడ చూసినా ఇద్దరే కనిపించారు. దానికి తోడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కూడా నిహారిక, చైతన్య రచ్చ రచ్చ చేశారు. దాంతో మెగా కొత్తల్లుడు గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటుంది.

ఇదిలా ఉంటే నిహారిక పెళ్ళికి తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ నిబంధనల ప్రకారం చాలా తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించాలి. మెగా కుటుంబం కూడా ఇదే చేసింది. తమకు అత్యంత సన్నిహితులను మాత్రమే పెళ్ళికి ఆహ్వానించి.. మిగిలిన వాళ్లకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక గ్రాండ్ పార్టీ ఏర్పాటు అరేంజ్ చేయాలని మెగా ఫ్యామిలీ భావిస్తుంది. ఇప్పటికే నిహారిక పెళ్లి కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందురు ఉదయపూర్ చేరుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. రెండు రోజుల షెడ్యూల్ తర్వాత నేరుగా ఆయన ఉదయపూర్ వెళ్లనున్నాడు.

మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా పెళ్లికి రెండు రోజుల ముందు ఉదయ్‌పూర్ వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నాడు. రామ్ చరణ్, అల్లు అర్జున్  కూడా తమ షూటింగ్‌లో తీరిక చేసుకొని డిసెంబర్ 7 ఉదయం ఉదయ్ పూర్‌‌కు తమ కుటుంబ సభ్యలతో కలిసి  చేరుకోనున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో కొందరి హీరోలకు దర్శకులకు మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానం లభించినట్లు తెలుస్తోంది. తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున‌లకు చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి తన సోదరుడు కూతురు పెళ్లికి రావాలని ఆహ్వానించాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు రానా, నితిన్, నాగ చైతన్య దంపతులకు కూడా వరుణ్ తేజ్ వైపు నుంచి ఆహ్వానం వెళ్లిందని తెలుస్తుంది. స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు కొరటాల శివ, మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు‌లకు  ఆర్కా మీడియా, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలో పాటు అనిల్ సుంకర, దానయ్య, దిల్ రాజు‌తో పాటు, సురేష్ బాబులకు ఆహ్వానాలు అందినట్టు ప్రచారమైతే జరుగుతుంది. 

More Related Stories