కరోనానే కాదు ఏదీ నా పెళ్లిని ఆపలేదంటున్న నిఖిల్Nikhil
2020-03-17 12:54:38

కరోనా దెబ్బ మామూలుగా లేదు. ఈ వైరస్ దెబ్బకు అమెరికా లాంటి పెద్ద దేశాలే వణికిపోతున్నాయి. దేనిని అయినా ఎదుర్కొంటామనే ట్రంప్ లాంటి వాళ్ళు కూడా తమకు ఎక్కడ ఈ వైరస్ వస్తుందో అనే టెన్షన్ లో ఉన్నారు. మన దేశంలో అయితే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఐపీఎల్ లాంటి వేడుకలు కూడా రద్దయ్యే అవకాశం ఉందంటూ వినిపిస్తున్నాయి. ఇక పెళ్ళిళ్ళు లాంటి ఎక్కువగా జనం పోగయ్యే కార్యక్రమాలు వద్దంటోంది ప్రభుత్వం. 

ఈ క్రమంలో టాలీవుడ్ హీరో నిఖిల్ పెళ్లి వాయిదా పడిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి తాజాగా ఆయన స్పందించారు.తన పెళ్లి మీద ఆందోళన అవసరం లేదన్న ఆయన కరోనా కాదు..ఏదొచ్చినా మా పెళ్లి ఖచ్చితంగా జరగుతుందని పేర్కొన్నారు. వాయిదా వేసుకునే ప్రసక్తే లేదని, ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసేసుకుంటామని ఆయన చెప్పుకొచ్చాడు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. నిఖిల్ కి ప‌ల్లవి అనే డాక్టర్‌తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న వీరి పెళ్లి జరగాల్సి ఉంది.  

More Related Stories