నిఖిల్ ఆ రెండు సినిమాలు పూర్తిగా వదిలేసినట్లేనా..?Nikhil
2019-08-15 07:21:22

స్వామి రారా తర్వాత నిఖిల్ సినిమాలపై కూడా అంచనాలు భారీగానే ఉంటున్నాయి. అంతకుముందు ఆయన సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్లిపోయేవో కూడా తెలియదు. కానీ స్వామి రారా తర్వాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలు చేసాడు నిఖిల్. అయితే ఇన్ని విజయాలున్నా కూడా ఇప్పుడు నిఖిల్ సినిమాలకు కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న అర్జున్ సురవరం పరిస్థితి అర్థం కావడం లేదు. ఈ చిత్ర షూటింగ్ 2018లోనే పూర్తైంది. ఇప్పటికే విడుదల కావల్సిన సినిమా ఏడాదిగా వాయిదా పడుతూనే ఉంది. ఇక చూసి చూసి దీన్ని వదిలేసాడు నిఖిల్. ఈ చిత్రం చుట్టూ 10 కోట్ల స్కాండిల్ ఉంది. దాంతో దాని చుట్టుపక్కలకు ఎవరూ వెళ్ళడం లేదు. ఇదిలా ఉంటే అర్జున్ సురవరంతో పాటు శ్వాస అనే మరో సినిమా కూడా మొదలు పెట్టాడు నిఖిల్. నివేదా థామస్ హీరోయిన్ గా ఆ మధ్య ఈ చిత్రానికి కొబ్బరికాయ్ కొట్టాడు. మొదలైన తర్వాత ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా లేదు. అనివార్య కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆపేసారు. ఈ పరిస్థితుల్లో కార్తికేయ దర్శకుడు చందూ మొండేటితో ఈ చిత్ర సీక్వెల్ చేయడానికి ముందుకొస్తున్నాడు నిఖిల్. మొత్తానికి కార్తికేయ 2తో బిజీగా ఉండి ముందు రెండు సినిమాలను వదిలేసినట్లు ఉన్నాడు నిఖిల్. 

More Related Stories