కుమారి 21ఎఫ్ డైరెక్టర్ తో నిఖిల్ సినిమాnikil
2019-12-04 12:03:30

మొన్నీమధ్యనే అర్జున్ సురవరం చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు యువ హీరో నిఖిల్ సిద్దార్థ. తమిళంలో సూపర్ హిట్ అయిన కణితన్ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసి హిట్  కొట్టాడు ఈ హీరో. సంతోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తో ముందుకు వెళుతోంది. ఈ సినిమా సక్సెస్‌తో ఫుల్‌జోష్ మీదున్న నిఖిల్ తన కొత్త సినిమా అనౌన్స్ చేశారు. కుమారి 21ఎఫ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రకాష్ దర్శకత్వంలో నిఖిల్ సినిమా మొదలు కానుంది. గీతాఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. ఈ విషయాన్ని వెల్లడించిన నిఖిల్ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో నటించే అవకాశం గొప్ప, అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమకి సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా త్వరలోనే సెట్స్‌ మీదకి వెళ్లనున్నట్లు టాక్. అయితే హీరో, దర్శకుల వివరాలు అయితే వెల్లడించారు కానీ నటీనటుల వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించవచ్చని భావిస్తున్నారు.

More Related Stories