నిఖిల్ లాక్‌డౌన్ మ్యారేజ్.. మరికొన్ని గంటల్లో పెళ్లి..Nikhil Siddhartha
2020-05-13 17:16:50

లాక్‌డౌన్ సడలింపుల తర్వాత ఒక్కొక్కటిగా శుభకార్యాలు అయితే జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న దిల్ రాజు అతితక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు హీరో నిఖిల్ కూడా ఇదే చేయబోతున్నాడు. ఇప్పటికే ఈయన పెళ్లి వాయిదా పడింది. ఎప్రిల్ 16న జరగాల్సిన పెళ్లిని కరోనా కారణంగా వాయిదా వేసారు. దాంతో మే 14న ఈయన పెళ్లి ఫిక్స్ చేసారు. ఇప్పుడు అనుకున్న సమయానికి తన పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు ఈయన. తన పెళ్లి వల్ల ఒక్కరికీ ఇబ్బంది వచ్చినా తాను సంతోషంగా ఉండలేనని.. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకంగా ఉంటుందని చెప్పాడు నిఖిల్. అందుకే అది మంచిగానే ఉండాలని ఆశిస్తున్నానని.. చాలా తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నాడు నిఖిల్. 

ఏ కరోనా నా పెళ్లికి అడ్డు కావు అని ఆ మధ్య చెప్పిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు ఇదే కరోనా కారణంగా తన పెళ్లిని ఓసారి వాయిదా వేసుకున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం తన పెళ్లిని నిరాడంబరంగా జరుపుకుని.. ఆ తర్వాత గ్రాండ్ పార్టీ ఇవ్వాలని చూస్తున్నాడు. నిఖిల్ తాను ప్రేమించిన పల్లవి వర్మను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈమె డాక్టర్.. కొన్ని రోజులుగా పల్లవితో ప్రేమలో ఉన్నాడు నిఖిల్. ఈ విషయం ఇంట్లో చెప్పి రెండు ఫ్యామిలీస్ ను ఒప్పించాడు ఈ కుర్ర హీరో. అందరిముందే ప్రపోజ్ చేసి తన ప్రేమను చూపించాడు నిఖిల్. మొన్నామధ్య నిశ్చితార్థం కూడా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు కొన్ని వైరల్ అయ్యాయి కూడా ప్రస్తుతం ఈయన కార్తికేయ 2, సుకుమార్ 18 పేజెస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యే నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మంచి విజయం సాధించింది.

More Related Stories