నాసా స్పేస్ సెంటర్ లో సందడి చేసిన కుర్ర హీరోలుnasa
2019-10-14 19:41:21

తెలుగు యువనటులు నాసా స్పేస్ సెంటర్ లో సందడి చేశారు. అదేంటి మన నటులకి అక్కడేమి పని, కొంప తీసి సినిమా ఏమైనా ప్లాన్ చేశారా అనుకుంటున్నారా ? ఆ విషయాలు అయితే ప్రస్తుతానికి బయటకి రాలేదు. తెలుగు కుర్ర హీరోలు నిఖిల్, సందీప్ కిషన్ లతో పాటు, బిగ్ బాస్ సీజన్ వన్ లో అలరించి ఎన్నో సినిమాల్లో నటించిన ఆదర్శ్ బాలకృష్ణ ఆ స్పేస్ సెంటర్ లో సందడి చేశారు. ఒక  పర్సనల్ ట్రిప్ లో భాగంగా అమెరికా వెళ్లిన ఈ యువ నటులు వాషింగ్టన్ డీసీలో ఉన్న నాసా సెంటర్ ని సందర్శిచడంతో పాటు, అక్కడ తాము దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. నార్త్ అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ అనబడే ఈ నాసాకు అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ అని చెబుతారు. మొన్న మన చంద్రయాన్ లో కూడా విక్రం ల్యాండర్ కనిపించక పోతే చాలా సహాయం చేశారు. సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, ఏ1 ఎక్స్ ప్రెస్ టైటిల్ హాకీ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాలో ఆయన నటించనున్నారు. మొన్నటికి మొన్న ఆమెజాన్ వారి ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కూడా కమాండోగా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇక నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. దీనితో ఈ యంగ్ హీరో కార్తికేయ 2 సినిమా తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఆ సినిమా బహుశా వచ్చే నెల కానీ ఆ పై వచ్చే నెల కానీ రిలీజయ్యే అవకాశం కనిపిస్తోంది.

More Related Stories