నితిన్ కాబోయే భార్య ఫోటో చూశారా.. ఇదిగో Nithiin
2020-02-14 20:33:33

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన నితిన్.. త్వరలోనే పెళ్లిపీఠలెక్కబోతున్న సంగతి తెలిసిందే. కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన షాలిని అనే అమ్మాయితో కొన్నాళ్లు ఫ్రెండ్షిప్ కొనసాగించిన నితిన్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దాంతో పెళ్లి పీఠలెక్కడానికి రెడీ అయ్యారు ఇద్దరు. ఏప్రిల్ 15న హైదరాబాద్ లో నితిన్, షాలినిల నిశ్చితార్థం జరగనుందట.. ఆ మరుసటి రోజే ఏప్రిల్ 16న దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్‌లో వివాహం జరగనుందని సమాచారం.

అయితే వీళ్ల పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు నితిన్ కు కాబోయే భార్యకు సంబంధించి ఒక్క ఫోటో కూడా బయటికి రాలేదు. కానీ తాజాగా ఆమె ఫోటో ఒక్కటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈమెనే నితిన్ కు కాబోయే భార్య అంటూ ఓ ఫోటో బయటికి వచ్చింది. ఆమెను చూసిన వారంతా నితన్ కు పర్ఫెక్ట్ జోడి అంటున్నారు.. అంతేకాదు వాలంటైన్స్ డే సందర్భంగా నితిన్ ఆమెకు సినిమా స్టైల్లోనే ప్రపోజ్ చేశాడట.. ఒంటికాలిపై నిల్చుని షాలినికి ఐ లవ్ యూ అంటూ అప్రపోజ్ చేశాడట. దాంతో వెంటనే నితిన్ ప్రపోజల్ స్టైల్ చూసి.. నవ్వుకున్న షాలిని.. లవ్ యూ టూ అని తన ప్రేమకు పచ్చజెండా ఊపిందట. ఇక.. నితిన్ సోదరి నిఖితా రెడ్డి దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు. ప్రస్తుతం నితిన్ భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు.

More Related Stories