మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన నితిన్..ఇదేం స్పీడ్ గురూ



Nithiin
2021-02-19 12:57:37

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ జోరుమీద ఉన్నాడు. వరుస పెట్టి సినిమాలు చేయడమే కాకుండా రిలీజ్ డేట్స్ కూడా ప్రకటిస్తున్నారు. ఇప్పటికే నితిన్ హీరోగా నటించిన "చెక్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరవాత "రంగ్ దే" ను లైన్ లో పెట్టాడు. ఈ సినిమా మార్చ్ 26 న రిలీజ్ కానుంది. ఇక తాజాగా మరో సినిమా రీమేక్ ను కూడా నితిన్ ప్రకటించారు. ప్రస్థితం నితిన్ బాలీవుడ్ సినిమా అందాదున్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. కాని సినిమా టైటిల్ ను ప్రకటించి ఫ్యాన్స్ అవక్కయ్యేలా చేశారు. ఈ చిత్రాన్ని జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతునట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసారు. ఇక ఈ సినిమాకు మెర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక నితిన్ తీరు చూస్తుంటే స్పీడ్ పెంచినట్టు కనిపిస్తున్నాడు. పెళ్లి తరవాత అసలు గ్యాప్ లేకుండా సినిమాల అప్డేట్ లను ఇస్తున్నాడు. అయితే పెళ్లయ్యాక నితిన్ సినిమా ఒక్కటి కూడా విడుదల అవ్వలేదు. మరి ఈ హీరో జాతకం ఇప్పుడెలా ఉంటుందో చూడాలి.

More Related Stories