నితిన్ మాస్ట్రో మూవీ ఫస్ట్‌ గ్లింప్స్Nithiin
2021-03-31 02:18:15

వ‌రుస సినిమాల‌తో యంగ్ హీరో నితిన్ సంద‌డి చేస్తున్నాడు. గ‌తేడాది భీష్మ‌కు ముందు ఏడాదిన్న‌రపాటు నితిన్ సినిమాలేమీ చేయ‌లేదు. కానీ త‌ర‌వాత మాత్రం వ‌రుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఈ యేడాది థియేట‌ర్స్ తెరుచుకున్న‌త‌ర‌వాత చెక్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. చెక్ త‌ర్వాత నితిన్ హీరోగా న‌టించిన రంగ్ దే సినిమా విడుద‌లైంది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం లో వ‌చ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తోంది. దాంతో సినిమాకు క‌లెక్ష‌న్స్ కూడా బాగానే వ‌స్తున్నాయి. 

ఇదిలా ఉండ‌గా నితిన్ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన అందాదున్ సినిమా రీమేక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ కు మ‌స్ట్రో అనే టైటిల్ ను ఖ‌రారు చేసి చిత్ర బృందం నేడు నితిన్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది. అంతే కాకుండా నితిన్ పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేసింది. 

ఇక ముందుగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో మాస్ట్రో  ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ వీడియోలో నితిన్ మ్యూజిక్ వాయిస్తూ క‌నిపిస్తున్నారు. అంతే కాకుండా సినిమాలో అందుడిగా క‌నిపిస్తున్న‌నితిన్ లుక్ ను గ్లింప్స్‌లో చూపించారు. ఇక ఈ సినిమా కూడా నితిన్ కెరీలో మ‌రో హిట్ అవుతుంద‌ని నితిన్ అభిమానులు అనుకుంటున్నారు.  

More Related Stories