రంగ్ దే లో న్యూడ్ గా నితిన్..నిజమేనా



Nithin Rang De
2021-03-24 15:22:39

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చెక్ సినిమా ఇటీవలే విడుదలయింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఇంతలోనే నితిన్ మరో సినిమా రంగ్ దే తో వస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఈ రొమాంటిక్ ప్రేమ కథ శుక్రవారం విడుదలకు సిద్దంగా ఉంది. శుక్రవారం రానా అరణ్య సినిమా కూడా విడుదల కాబోతోంది. దాంతో ఈ రెండు సినిమాల్లో ఏది విజయం సాధిస్తుందా అన్న ఆసక్తి మొదలైంది. అ

యితే రంగ్ దే పై ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది. సినిమాలో నితిన్ న్యూడ్ గా కనిపించబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై నితిన్ ను ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అవుననే సమాధానం ఇచ్చారు. సినిమాలో నితిన్ ఆ లుక్ లో కనిపించేంది నిజమే కానీ కేవలం షర్ట్ లెస్ గా కనిపిస్తాడు. అంతే కాని న్యూడ్ గా కనిపించబోడు. సినిమా పబ్లిసిటీ కోసం మాత్రమే న్యూడ్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక చెక్ సినిమా ఫ్లాప్ తో కష్టాల్లో ఉన్న నితిన్ రంగ్ దే పైనే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆ ఆశలు నెరవేరతాయా లేదా అన్నది చూడాలి.

More Related Stories