అభిమానులకు నితిన్ విన్నపం.. బర్త్ డే వేడుకలొద్దు..nithin
2020-03-30 06:58:07

కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు వేడుకలు చేసుకునేంత ఇష్టం ఎవరికీ లేదు. పైగా ఇది ఫంక్షన్స్ టైమ్ కూడా కాదు. హాయిగా ఇంట్లోనే ఉండి దేశానికి సేవ చేసే టైమ్ వచ్చిందంటూ పూరీ జగన్నాథ్ చెప్పిన మాటలు అక్షర సత్యంగా మారిపోయాయి. ఎందుకంటే ఇంట్లో ఉంటేనే కానీ కరోనా వైరస్ ని వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు దారి లేదు. ఈ నేపథ్యంలోనే నితిన్ కూడా అభిమానులకు లెటర్ రాసాడు. మార్చ్ 30న తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరూ సెలెబ్రేషన్స్ చేయొద్దని ఫ్యాన్స్ ను కోరాడు. తన మేలుకోరే వారందరికీ ఈ మాట చెబుతున్నట్లు సూచించాడు నితిన్. ఈ సారి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నానని.. దీనికి అంతా సహకరిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపాడు ఈ హీరో. కరోనా కారణంగా ఎప్రిల్ 16న జరగాల్సిన తన పెళ్లి కూడా వాయిదా వేసుకున్నట్లు తెలిపాడు ఈయన. దయచేసి అంతా ఇంట్లోనే ఉండి.. కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే దేశానికి సేవ చేసినట్లు అంటున్నాడు ఈయన. ఎల్లపుడూ మీ ప్రేమతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా కోరే నితిన్ చెబుతున్న మాట వినండి అంటూ లేఖ విడుదల చేసాడు ఈయన.

More Related Stories