వామ్మో నిత్యా నువ్వు కూడా మొదలెట్టావా ఇంకా..nithya
2020-01-20 11:50:35

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇండ‌స్ట్రీలో నెగ్గుకురావాలంటే అందం మాత్ర‌మే ఉంటే స‌రిపోదు.. ఆ అందాన్ని ఆర‌బోసే త‌త్వం కూడా ఉండాలి. అలా కాదు కుద‌ర‌దు అంటూ మ‌డి క‌ట్టుకుని కూర్చుంటే.. ఎలాంటి ముద్దుగుమ్మైనా ఇంటికి ప‌రిమితం కావాల్సిందే. విజ‌యాలు వ‌చ్చినా.. అందాలు ఆర‌బోయలేద‌ని అవ‌కాశాలు ఇవ్వ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మ‌న ఇండ‌స్ట్రీలో బోలెడంత మంది ఉన్నారు. గ్లామ‌ర్ షో చేయ‌మ‌ని మొండికేసి కెరీర్ ను త్వ‌ర‌గా ముగించేసిన ముద్దుగుమ్మ‌లు కూడా మ‌న ఇండ‌స్ట్రీలో బోలెడు. తాను అలా కాకూడదని ముందుగానే ఫిక్సైపోయింది నిత్యామీనన్. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అర ద‌శాబ్ధం దాటినా ఇప్ప‌టికీ కేవ‌లం న‌ట‌న‌తోనే నెట్టుకొస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 20 సినిమాల‌కు పైగానే న‌టించింది నిత్యా.

కానీ ఏ సినిమాలోనూ హ‌ద్దులు దాట‌లేదు. అప్పుడప్పుడూ మోడ్ర‌న్ డ్ర‌స్సుల్లోనూ క‌వ్విస్తుంది ఈ భామ‌. కానీ ఎప్పుడూ ఎక్స్ పోజింగ్ జోలికి వెళ్ల‌లేదు. కానీ ఇప్పుడు అటు వైపు అడుగేస్తోంద‌ని స‌మాచారం. మ‌రీ స‌మంత‌, త‌మ‌న్నా రేంజ్ లో కాక‌పోయినా.. తాను కూడా హీట్ పుట్టించాల‌ని ఫిక్సైంది నిత్యామీన‌న్. దీనికి ఆరంభంగా తాజాగా విడుద‌లైన ఓ హాట్ ఫోటోషూట్ నిదర్శనం. ఇందులో మోడ్ర‌న్ క్యాస్ట్యూమ్స్ తో కాక పుట్టించింది నిత్యా. ముఖ్యంగా కాళ్లు చూపిస్తూ పిచ్చెక్కించింది పాప. ఇక‌పై కూడా ఇంకాస్త డోస్ పెంచాల‌ని ఫిక్స‌యింది ఈ బ్యూటీ. అంతేకాదు బరువు కూడా తగ్గాలని ప్రయత్నాలు చేస్తుంది నిత్యామీనన్. మొత్తానికి గ్లామ‌ర్ ఇండ‌స్ట్రీలో ఉండ‌టానికి న‌ట‌న‌తో పాటు అందం కూడా ఆర‌బోయాల‌నే త‌త్వం ఇన్నాళ్ల‌కు ఈ బ్యూటీకి బోధ ప‌డింద‌న్న‌మాట‌.

More Related Stories