బెల్లంబాబుకూ నో టెన్షన్ ఆన్ కరోనాsrinivas
2020-03-18 14:02:55

ప్రస్తుతం అంతటా కరోనా ఫీవర్ నడుస్తోంది. ఈ దెబ్బకు పెద్ద పెద్ద దేశాలే షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక మన సినిమా వాళ్ళు కూడా ముందస్తు జాగ్రత్తగా థియేటర్స్ బంద్ చేశారు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో షూటింగ్స్ కూడా ఆపెస్తున్నట్టు ప్రకటించారు. అయితే పైకి మాత్రం అలా చెబుతున్నా ఎవరూ దీనిని ఫాలో అవుతున్నట్టు లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ రాదే, జక్కన్న ఆర్యార్ఆర్, కమ్ముల లవ్ స్టోరీ సినిమా యూనిట్ లు షూటింగ్ చేసినట్టు వార్తల్లో వచ్చాయి. ఇప్పుడు ఈ బాటలో మరో యూనిట్ నడుస్తోంది. అయితే పైవేవీ వివాదాస్పదం కాకపోగా ఇప్పుడు ఈ వ్యవహారం మాత్రం వివాదాస్పదం అయ్యేలాగా కనిపిస్తోంది. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ సినిమా షూట్ ని కూడా క్యాన్సిల్ చేయమని కోరితే నిర్మాతలు అలా కాకుండా షూట్ చేస్తున్నారట.

సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం మేరకు హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ సినిమా షూటింగ్‌ను కంటిన్యూ చేయాలని గట్టిగ చెప్పారట. అంతే కాకుండా హీరోయిన్ నభా నటేశ్‌ ను కూడా బెంగళూరు నుండి హైదరాబాద్‌కు రమ్మని గట్టిగా చెప్పారట. ఇండస్ట్రీ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నానని తెలిసినా నభా నటేశ్‌ తన నిర్మాతకు అనుగుణంగా షూటింగ్‌లో పాల్గొంటుందని చెబుతున్నారు. ఈ షెడ్యూల్‌లో కాంబినేషన్ సీన్స్ షూట్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ వాయిదా పడితే కాల్షీట్స్ ఇబ్బంది అని భావించి నిర్మాతలు ఇలా ముందుకు వెళ్ళాల్సి వస్తోందని అంటున్నారు.

 

More Related Stories