పవన్ తో ఆ డైరెక్టర్ సినిమా లేనట్టే ?pk
2020-05-10 16:26:00

ఇక సినిమాలే చేయను ఇక జీవితం ప్రజలకి అంకితం అని చాలా సార్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఏకంగా వరుసగా మూడు సినిమాలు ఒప్పుకుని తన అభిమానులకే కాక సినీ ప్రియులకు కూడా షాకిచ్చారు. ఆయన రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా దెబ్బకు ఆ ప్లాన్ అంతా అప్సెట్ అయిందనుకోండి. ఇక ఈ సినిమా కాక ఆయన క్రిష్ డైరెక్షన్ లో ఒక పీరియాడిక్ మూవీ కూడా చేస్తున్నారు. ఇక అది కాక హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నారు పవన్. అయితే ఆయన దర్శకుడు డాలీకి కూడా అవకాశం ఇచ్చినట్టు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. గతంలో రెండు సినిమాలు చేసిన డాలీ మీద ఉన్న నమ్మకంతో ఇప్పుడు మరో సినిమా చేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు. అన్నీ కుదిరితే సినిమా 2021 చివర్లో షూటింగ్ కి వెళ్తారని ఆ ప్రచారం సారాంశం. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని అంటున్నారు. ఎందుకంటే పవన్ – డాలీ మధ్య సినిమాకి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని పవన్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. అయితే వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది నిర్మాతలు మాత్రం పవన్ ను అప్రోచ్ అయ్యారని, కానీ పవన్ మాత్రం ఎవరికీ ఎటువంటి గ్రీన్ సిగ్నల్ లభించలేదని అంటున్నారు.  

 

More Related Stories