గుడ్ ల‌క్ స‌ఖిపై రూమ‌ర్లు..క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు



Keerthy Suresh
2021-06-07 12:22:39

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ మ‌హాన‌టి సినిమాతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్ప‌టి వ‌ర‌కూ గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించి మెప్పించిన కీర్తి మ‌హాన‌టి త‌ర‌వాత మాత్రం ఎక్కువ‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తూ అల‌రిస్తోంది. ఇక తాజాగా కీర్తిసురేష్ న‌టించిన సినిమా గుడ్ ల‌క్ స‌ఖి. ఈ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి , జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అంతే కాకుండా నాగేష్ కుకునూర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 

అయితే లాక్ డౌన్ కార‌ణంగా ఈ సినిమా ఓటీటీలోకి వ‌స్తుందంటూ ర‌క‌ర‌కాల‌ వార్త‌లు వ‌స్తున్నాయి. దాంతో తాజాగా ఆ వార్త‌ల‌పై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజుల నుండి గుడ్ ల‌క్ స‌ఖి సినిమా ఓటీటీలో నేరుగా విడుద‌ల‌వుతుంద‌ని రూమ‌ర్లు వ‌స్తున్నాయి. ఆ వార్త‌ల‌ను మేము ఖండిస్తున్నాము. ఈ సినిమా విడుద‌ల‌పై ఎలాంటి అప్డేట్ ఉన్నా మేమే చెబుతాము ద‌య‌చేసి ఎలాంటి రూమ‌ర్ల‌ను న‌మ్మ‌కండి. అంటూ నిర్మాత‌లు క్లారిటీ ఇచ్చారు. 

More Related Stories