ఎన్టీఆర్ కొరటాల సినిమాపై సాయంత్రం క్లారిటీ 



NTR and Koratala Siva
2021-04-12 14:27:10

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అరవింద సమేత’ తర్వాత ఓ సినిమా తెరకెక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఆగిపోయిందని, త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రం సూపర్‌ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడనేలా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కొరటాలతో ఎన్టీఆర్ సినిమా వుండబోతోందని టాక్. 

ఈ నేపథ్యంలో  ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన పూర్తి క్లారిటీ ఈ రోజు సాయంత్రం 7.02ని.ల‌కు రానుంద‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో అభిమానుల ఆనందం అవ‌ధులు దాట‌డం ఖాయం. ఇక ఎన్టీఆర్ బిగ్ బాస్ షో త‌ర్వాత మ‌ళ్లీ ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌కు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

More Related Stories