మెహర్ రమేష్ పై ఎన్టీఆర్ అభిమానుల ట్రోల్స్Meher Ramesh
2020-04-03 12:30:08

లాక్ డౌన్ ఎఫెక్ట్ తో కాలేజీలు, ఆఫిస్ లు మూతపడి అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు మనకున్న కాలక్షేపం సోషల్ మీడియానే కాబట్టి అందులోనే కాలం గడుపుతున్నారు. సెలెబ్రిటీ లు కూడా వారి అభిమానులకు సోషల్ మీడియాతో కొంత వినోదాన్ని  పంచుతున్నారు. కొందరు భామలు వ్యాయామం  చేస్తూ ఆ ఫోటోలను షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచుతుండగా మరి కొందరు వారి పర్సనల్ విషయాలు చెప్పుకుంటూ అభిమానుకు వినోదం అందిస్తున్నారు. అయినా సమయం గడవని అభిమానులు  సినిమా థియేటర్లు , షూటింగ్లు నిలిచి పోవడంతో హీరోల  ఫ్యాన్స్ పాతజ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు.

తాజాగా జల్సా సినిమా వచ్చి 12 ఏళ్ళు అయిన సందర్భంగా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేసారు. తమ అభిమాన హీరోపై  , ,హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ పై మరోసారి ప్రశంసలు కురిపించారు. ఇక ప్రభాస్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమా బిల్లా వచ్చి కూడా 11 సంవత్సరాలు అవుతుంది. ఈ సందరభంగా డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సోషమీడియా లో సందడి చేస్తున్నారు. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది కానీ ఈ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో మరోసారి ఎన్టీఆర్ అభిమానులు మెహర్ పై మండి పడుతున్నారు.  దీనికి కారణం ఎన్టీఆర్ శక్తి సినిమా వచ్చి కూడా 9 ఏళ్లయింది. శక్తి సినిమా ఎన్టీఆర్ కెరీర్లో నే పెద్ద డిజాస్టర్ గా  నిలిచిన విషయం తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ఎన్టీఆర్ అభిమానులు మెహర్ పై ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఎంకి పెళ్ళి సుబ్బి సావుకొచ్చినట్టు లాక్ డౌన్ ఎఫెక్ట్ మెహర్ పై పడింది.   
 

More Related Stories