బాలకృష్ణ చేసిన పనికి ఎగిరి గంతులేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్..Balakrishna NTR.jpg
2019-10-27 07:26:16

నందమూరి కుటుంబం పైకి చూడడానికి ఒకటిగా కనిపిస్తుంది కాని లోలోపల చాలా లొసుగులు ఉంటాయి అంటారు ఇండస్ట్రీలో కొందరు విశ్లేషకులు. దానికి తగ్గట్లుగానే చాలా ఏళ్ల పాటు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాల మధ్య మాటలు లేవు. గత ఏడాది హరికృష్ణ చనిపోయే వరకు కూడా దాదాపు ఏడేళ్లు ఎన్టీఆర్ బాలయ్య మాట్లాడలేదంటారు ఇండస్ట్రీ వర్గాలు. అయితే యాక్సిడెంట్లో హరికృష్ణ మరణించడం.. ఆ తర్వాత కొడుకులను బాలయ్య చేరదీయడం వరుసగా జరిగిపోయాయి. అన్నయ్య మరణం తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు అన్నీ తానే అయి చూసుకుంటున్నాడు బాలకృష్ణ. ఇ

ఉంటే ఇప్పుడు బాలయ్య ఎన్టీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానికి నిదర్శనమే ప్రస్తుతం బాలకృష్ణ సినిమా టైటిల్ అంటున్నారు అభిమానులు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాకు రూలర్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. దాంతో బాలయ్య అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కారణాలు కూడా ఉన్నాయి. రూలర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే. ఎందుకంటే బోయపాటి శ్రీను తెరకెక్కించిన దమ్ము సినిమాలోని పాట ఇది. కీరవాణి స్వరపరచిన ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. దమ్ము సినిమా ఫ్లాప్ అయినా కూడా రూలర్ అనే పాట మాత్రం బాగా విజయం సాధించింది. అలాంటి ఫేమస్ పాటలోని పదాన్ని తన సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు బాలకృష్ణ. దాంతో నందమూరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

బాబాయితన సినిమా కోసం వాడుకోవడం వాళ్లు చాలా గౌరవంగా భావిస్తున్నారు. డిసెంబర్ 20న రూలర్ విడుదల కానుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా, మాఫియా డాన్ గా రెండు భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు బాలకృష్ణ.

More Related Stories