జక్కన్న బర్త్ డే..ఇలా విష్ చేసిన కొమురంభీమ్ NTR
2020-10-10 12:28:54

దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా నటీనటులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాజమౌళి 1973 లో కర్ణాటకలో జన్మించారు. సినిమాలపై ఆసక్తితో ఎంట్రీ ఇచ్చిన రాజమౌళి మొదట సీరియల్స్ కు పని చేసి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. తరవాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అంతే కాకుండా తెలుగు పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నారు. ప్రస్తుతం ఆయన రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో బ్రేక్ పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యింది. అయితే జక్కన్న పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ఆయనతో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఫొటోలో ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వులు పూయిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు ఎన్టీఆర్ అభిమానులు, రాంచరణ్ అభిమానులు జక్కన్న కు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి, ఎన్టీఆర్ లది ఒక ప్రత్యేకమైన బంధం అని చెప్పవచ్చు. రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన "స్టూడెంట్ నెంబర్1" సూపర్ హిట్ అయ్యింది. ఆ తరవాత వరుసగా యమదొంగ, సింహాద్రి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఇక చాలా కాలం గ్యాప్ తరవాత రాజమౌళి ఎన్టీఆర్ తో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు . ఎలాగూ రాజమౌళి మార్క్ ఉంది కాబట్టి తమ హీరో పాక్కా హిట్ కొడతాడని డిసైడ్ అయ్యారు.

More Related Stories