ఓంకార్ కు కరోనా...క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ  Ohmkar
2020-06-28 20:00:36

టాలీవుడ్ లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే బండ్ల గణేష్ కి కరోనా వైరస్ సోకిందన్న విషయం మరువక ముందే ఇద్దరు సీరియల్ నటులకి సోకింది. తాజాగా నటుడు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఓంకార్ కి కరోనా వైరస్ సోకిందని ఈరోజు ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఓంకార్ ప్రస్తుతానికి బుల్లితెర మీద కొన్ని ప్రోగ్రామ్స్ ని సొంతగా ప్రొడ్యూస్ చేస్తూ హోస్ట్ చేస్తున్నాడు. అయితే సడన్ గా ఆయన షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేయడంతో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందనే ప్రచారం మొదలయింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. కరోనా లక్షణాలు ఉండడం నిజమేనని, అందుకే ఆయన ముందు జాగ్రత్తగా కరోనా పరీక్ష చేయించుకున్నారని నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని పేర్కొన్నారు. దీంతో ఆయన సోమవారం నుండి షూటింగ్ లో పాల్గొంటున్నారని కుటుంబ సభ్యులు తెలియ జేశారు.
 

More Related Stories