పూరీ బర్త్ డే స్పెషల్...ఇస్మార్ట్ రీరిలీజ్ismart Shankar Re-Release.jpg
2019-09-26 08:58:10

హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్ హీరోయిన్లుగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టి హిట్ సినిమాగా నిలిచింది. తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కిన ఈ సినిమా 75 కోట్లకు పైగా షేర్ ను రాబట్టి రిలీజయిన అన్ని ప్రాంతాల్లో సేఫ్ జోన్‌ లోకి వెళ్ళింది.

ఈ సినిమా హిట్ కావడంతో ఎంతో కాలంగా హిట్ లేక ఇబ్బంది పడిన దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ ఇద్దరూ మళ్ళీ హిట్ ల బాటలో పయనిస్తారని భావిస్తున్నారు. రామ్ సంగతి పక్కన పెడితే పూరీ ఏకంగా విజయ్ దేవరకొండతోనే సినిమా అనౌన్స్ చేశాడు. ఇక తాజాగా పూరీ పుట్టినరోజు త్వరలోనే ఉండడంతో ఆ సినిమా యూనిట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఈ నెల 28న పూరి పుట్టినరోజు. ఈ సందర్బంగా ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల రీరిలీజ్ చేయడానికి పూరి అండ్ టీమ్ రెడీ అయింది.

ఈ విషయాన్ని నిన్న చార్మీ సోషల్ మీడియాలో ప్రకటించింది. కొన్ని సేలేక్తేడ్ థియేటర్స్ లోనే ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. నిజానికి ఒక రకంగా ఏదైనా సినిమా థియేటర్లలో ఆడేసి వెళ్లిపోయాక రీరిలీజ్ అంటే ఈ డిజిటల్ యుగంలో సాహసమనే చెప్పాలి. పూరి విజయ్ దేవరకొండ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఇటివలే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Related Stories