అక్టోబర్ 18న ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ Operation Gold Fish
2019-09-27 13:20:56

వినాయకుడు, విలేజ్‌లో వినాయకుడు, కేరింత వంటి హిట్‌ సినిమాలు తీసిన సాయికిరణ్‌ అడివి దర్శకత్వంలో వస్తున్న తాజా సినిమా ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’(ఒ.జి.యఫ్‌). ఆది సాయికుమార్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రముఖ రచయిత అబ్బూరి రవి విలన్ గా నటించారు.ఒక టీమ్ కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 18న విడుదల కానుంది. ఈ సినిమా కాశ్మీర్‌ పండిట్ల సమస్యల గురించి ఉండనుందని అంటున్నారు.  ఎన్.ఎస్.జీ కమాండోగా ఆదిసాయికుమార్, టెర్రరిస్ట్ ఘాజీబాబా పాత్రలో అబ్బూరి రవి నటిస్తున్నారు. 

ఈ సినిమాలోని కీరవాణి పాడిన ఒక దేశభక్తి గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రాశారు. కథపై దర్శకుడు ఎంతగానో పరిశోధన చేశారని, కశ్మీర్ పండిట్ల జీవితాలను అక్కడి పరిస్థితుల్ని కళ్లకు కట్టే సినిమా అని చెబుతున్నారు . ఈ సినిమా ఈ మధ్య రచ్చ రేపిన అయితే ఈ ఆర్టికల్ 370, 35A ర‌ద్దు అంశాన్ని స్పృశిస్తూ తెరకేక్కడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజ‌కీయాలు, దేశ‌భ‌క్తి అనే అంశాల‌తో పాటు చిన్న లవ్ ట్రాక్ కూడా ఈ సినిమాలో యాడ్ చేశారు. శషాచెట్రి, కార్తీక్‌రాజు, పార్వతీశం, నిత్యానరేష్ తదితరులు నటిస్తున్న  ఈ సినిమా ఎలా ఉండనుందో చూడాలి మరి  ?

More Related Stories