ఆపరేషన్‌ గోల్డ్‌ఫిష్‌ రివ్యూgoldfish
2019-10-18 21:43:34

1980లో కశ్మీర్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కింది ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఉగ్రవాదం నేపథ్యంలో సాగే కథ, కథనాలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. గత కొన్నేళ్లుగా హిట్ కోసం చూస్తున్న ఆది కమాండోగా, అబ్బూరి రవి విలన్ గా నటించిన ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ : ఒక ఉగ్రవాద సంస్థకు ముఖ్య నాయకుడు ఘాజీ బాబా (అబ్బూరి రవి). హైదరాబాద్‌ వచ్చిన ఘాజీబాబాను కమాండో ఆపరేషన్‌ లో అర్జున్‌ పండిట్‌ (ఆది) అరెస్టు చేస్తాడు. ఘాజీబాబాను విడిపించటానికి అతని ప్రధాన అనుచరుడైన ఫారూఖ్‌ (మనోజ్‌ నందన్‌) ఒక పథకం రచిస్తాడు. ఓ కేంద్రమంత్రి కూతురిని కిడ్నాప్‌ చేసి, ఘాజీబాబాను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తాడు. అయితే, ఈ విషయం ముందే పసిగట్టిన అర్జున్‌ కేంద్రమంత్రి కుమార్తె కిడ్నాప్‌ కాకుండా రక్షిస్తుంటాడు. మరి ఆ అమ్మాయిని కిడ్నాప్‌ అవుతుందా ? చివరికి ఏమవుతుంది అన్నదే కథ.

విశ్లేషణ :

ఘాజీబాబాను విడిపించి వెనక్కి తీసుకువెళ్ళడానికి ఒక సెలబ్రిటీని కిడ్నాప్ చేయాలి. అందుకు సెంట్రల్‌ మినిస్టర్‌ కుమార్తెను ఫిక్స్ చేసుకుంటారు. ఆ కిడ్నాప్ ఆపరేషన్ కి వాళ్లు పెట్టుకున్న పేరు ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్’. ఘాజీ బాబా నాయకత్వంలో ఉగ్రవాదుల అరాచకాలు..  కమాండోలు ఘాజీబాబాను పట్టుకోవడం..  అర్జున్‌ పండిట్‌ను విచారించడం.. ఇలాంటి సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. అయితే కథ కాలేజీకి షిఫ్ట్ అయినప్పటి నుంచి కథనం నెమ్మదిస్తుంది. సన్నివేశాలన్నీ సాగదీసినట్టు అనిపిస్తాయి. కథలో సీరియస్‌ నెస్‌ కూడా మిస్సయినట్టు అనిస్తుంది. ఇది ఆదికి కొత్త రకమైన పాత్ర. అర్జున్‌ పండిట్‌గా చాలా సీరియస్‌గా కనిపించాడు. ఉగ్రవాదిగా కనిపించిన అబ్బూరి రవి రచయిత అయినా తనలో ఓ నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఎయిర్‌టెల్‌ పాపగా అందరికీ సుపరిచితమైన సాషా చెత్రికు ఇది మొదటి సినిమా అయిన గుర్తుండిపోయే పాత్ర ఏమీ కాదు. మనోజ్‌ కూడా ప్రతినాయకుడిగా మెప్పించాడు. మిగిలిన వారంతా తమ పరిధి మేరకు నటించారు. దర్శకుడు వినోదం కోసం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. నేపథ్య సంగీతం కూడా నప్పలేదు. బడ్జెట్‌ లిమిట్ కొన్ని సీన్స్ లో కనిపిస్తుంది.

చివరిగా: ‘ఆపరేషన్‌’ గోల్డ్ ఫిష్...సరిగ్గా ఉడకలేదు  

 

More Related Stories