ఆస్కార్ వేడుక వాయిదా..93 ఏళ్ళల్లో చరిత్ర లో తొలిసారి.. Oscars 2021
2020-05-14 17:44:23

కరోనా వైరస్‌ కల్లోలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలూ మూతపడ్డాయి. ప్రజలకు వినోదాన్ని పంచే.. సినిమా రంగం కూడా యాభై రోజులుగా నిలిచిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ సినిమా షూటింగులు, రిలీజ్‌లు వాయిదాపడ్డాయి. అయితే సినీ పరిశ్రమలో అతి పెద్ద పండుగ ఆస్కార్‌పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. సినిమా రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవాన్ని కూడా వాయిదా వేయాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పలు జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో దీనిపై కథనాలు వెలుడ్డాయి. ఈ ఏడాది భారీ సంఖ్యలో చిత్రాలు విడుదల కాకపోవడంతో ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని మూడు లేదా నాలుగు నెలలు వాయిదా వేయనున్నారని తెలుస్తోంది. ఒకవేళ  ఇదే నిజమైతే... 93 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో అవార్డుల ప్రదానోత్సవాన్ని వాయిదా వేయడం ఇదే తొలిసారి అవుతుంది. లాక్ డౌన్ వలన టాప్ గన్: మార్విక్, నో టైమ్ టూ డై, ములాన్, బ్లాంక్ విండో వంటి భారీ సినిమాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక సినిమాలు వాయిదా పడ్డాయి. ఇలాంటి పరిస్థితులలో ఆస్కార్ వేడుకని ఫిబ్రవరిలో జరపడం భావ్యం కాదని భావించి వాయిదా వేయాలని చూస్తున్నట్టు చెబుతున్నారు.  

More Related Stories