బిగ్ బాస్ 3పై ప‌గ‌బ‌ట్టిన ప‌రిస్థితులు.. ఓయూ విద్యార్థుల ఆగ్ర‌హం..



biggboss3
2019-07-17 19:08:20

బిగ్ బాస్ సీజ‌న్ 3 ప్ర‌క‌టించిన టైమ్ అస్స‌లు బాగోలేన‌ట్లుంది. లేక‌పోతే మ‌రేంటి.. రోజూ ఏదో ఓ వివాదంతో ఇది వార్త‌ల్లోనే ఉంటుంది. మొద‌ల‌వ్వ‌క ముందే ఇలా ఉంటే రేపు మొద‌లైన త‌ర్వాత ఈ వివాదాల‌ను త‌ట్టుకోవ‌డం ఎవ‌రి వ‌ల్ల కాదేమో..? ఏదైనా ఇష్యూ ఉంటే క్లియ‌ర్ చేయొచ్చు.. కానీ కావాల‌నే ఇష్యూస్ క్రియేట్ చేస్తుంటే ఎవ‌రు మాత్రం ఎన్నిసార్లు క్లియ‌ర్ చేస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ 3 విష‌యంలో ఇదే జ‌రుగుతుందేమో అనిపిస్తుంది. స‌మాజంలో ఇన్ని జ‌రుగుతుంటే అవ‌న్నీ వ‌దిలేసి ఇప్పుడు కేవ‌లం ఈ షో ఆపడం ఒక్క‌టే ప‌ర‌మావ‌ధి అన్న‌ట్లుగా కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న క‌నిపిస్తుంది. ఇదే ఇప్పుడు అస‌లు ర‌చ్చ‌కు కార‌ణం. ఇప్ప‌టికే శ్వేతా రెడ్డి, గాయ‌త్రి గుప్తా చేసిన ర‌చ్చ‌తో బిగ్ బాస్ ప‌రువు గంగ‌లో క‌లిసిపోయింది. ఇప్పుడు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కూడా ఈ షోపై కేస్ కూడా ఫైల్ చేసాడు. ఇవ‌న్నీ చాల‌వ‌న్న‌ట్లు ఇప్పుడు ఈయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఓయూ విద్యార్థులు కూడా ఆందోళన చేప‌ట్ట‌డంతో ప‌రిస్థితులు ఎక్క‌డికి వెళ్లునున్నాయో అర్థం కావ‌డం లేదు. వెంట‌నే ఈ షో నుంచి బ‌య‌టికి రాక‌పోతే ఇంటితో పాటు ఆఫీసుల‌ను కూడా ముట్టడిస్తామ‌ని నాగార్జున‌కు వార్నింగ్ ఇస్తున్నారు ఓయూ విద్యార్థులు. బిగ్ బాస్ లో కాస్టింగ్ కౌచ్ తో పాటు లైంగిక నేరాలు కూడా జ‌రుగుతున్నాయ‌ని వాళ్లు ఆరోపిస్తున్నారు. హై కోర్టు దీనిపై ఎలాంటి సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోవ‌ద్ద‌ని.. నిర్వాహ‌కుల‌ను అరెస్ట్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెబుతున్నా కూడా కాంట్ర‌వ‌ర్సీలు మాత్రం ఆగ‌టం లేదు. ప‌రిస్థితులు చూస్తుంటే ఇవ‌న్నీ దాటుకుని ఈ షో జులై 21న మొద‌ల‌వుతుందా అనేది ఇప్పుడు అనుమాన‌మే.

More Related Stories