పరశురామ్ రెమ్యునరేషన్ కి కరోనా ఎఫెక్ట్  Parasuram
2020-06-13 12:10:44

కరోనా దెబ్బ మామూలుగా లేదు. ఇప్పటికే దీని వలన అన్ని రంగాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ముఖ్యంగా సినిమా రంగం. ఎంతలా అంటే అంతా రివర్స్ అయిపోయేట్టు. తాజగా మ‌హేష్ 27వ సినిమా స‌ర్కారు వారి పాట‌ను,  ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. అయితే తాజాగా కృష్ణ పుట్టిన రోజు నాడే ఈ సినిమా టైటిల్ లోగోను విడుద‌ల చేస్తూ సినిమాను అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల నుండి ప్రారంభం అవుతుంద‌ని అనుకున్నా అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఏకంగా డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ కి వెళ్దామని మహేష్ చెప్పడంతో నిర్మాత‌లు సినిమాని వ్యయాన్ని త‌గ్గించే ప‌నిలో ప‌డ్డార‌ట‌. అందులో భాగంగా డైరెక్ట‌ర్ పరుశురామ్‌కు రెమ్యున‌రేష‌న్‌ను త‌గ్గించుకున్నాడని అంటున్నారు. గీత‌గోవిందం సినిమాకు రూ.9కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్న ప‌రుశురామ్ ఈ సినిమాకు మాత్రం రూ.7కోట్ల‌ను మాత్రమే తీసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో సినిమాలు ఇప్పట్లో రిలీజ్ అయ్యే పరిస్ధితి లేకపోవడంతో పరుశరామ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

More Related Stories