పవన్ కళ్యాణ్ కెరీర్‌లో పట్టాలెక్కకుండానే ఆగిపోయిన 12 సినిమాలు ఇవే..pk
2020-04-18 07:14:47

చెప్పాలని ఉంది: పవన్ కళ్యాణ్, అమీషా పటేల్ జంటగా ఈ సినిమాను సూర్య మూవీస్ ప్లాన్ చేసింది. కానీ అదే సినిమాను నువ్వే కావాలి పేరుతో తెరకెక్కించడంతో పవన్ సినిమా ఆగిపోయింది.
 
సత్యాగ్రహి: జానీ తర్వాత మరోసారి దర్శకత్వం చేయాలని పవన్ రాసుకున్న కథ సత్యాగ్రహి. ఇది కూడా ఏఎం రత్నం నిర్మాతగానే అట్టహాసంగా మొదలై సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

సింగీతం శ్రీనివాసరావు జీసెస్ క్రైస్ట్: అప్పట్లో ఏసుక్రీస్తు జీవితంపై పవన్ హీరోగా సింగీతం ఓ సినిమా ప్లాన్ చేసాడు. అనౌన్స్‌మెంట్ కూడా వచ్చిన తర్వాత ఆగిపోయింది.

దేశి: దేశభక్తి నేపథ్యంలో తాను సొంతంగా కథ రాసుకుని పవన్ కళ్యాణ్ చేయాలనుకున్న సినిమా దేశీ. కానీ అనివార్య కారణాలతో ఈ చిత్రం పట్టాలెక్కలేదు.

లారెన్స్: పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని లారెన్స్ చాలా ఏళ్లుగా అనుకుంటున్నాడు. అప్పట్లో ప్రకటించాడు కూడా.. కానీ కుదర్లేదు.

కోబలి: త్రివిక్రమ్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హీరోగా కోబలి సినిమా చేద్దామనుకున్నాడు త్రివిక్రమ్. కానీ అది కుదర్లేదు.. అదే కథను కాస్త మార్చి ఎన్టీఆర్‌తో అరవింద సమేత చేసాడంటారు విశ్లేషకులు.

సీతమ్మ వాకిట్లో: ఈ సినిమా ముందు పవన్, వెంకటేష్ చేయాల్సి ఉంది. అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ అనుకోకుండా పవన్ తప్పుకోవడం.. మహేష్ బాబు రావడం జరిగిపోయాయి.

వినాయక్: మాస్ దర్శకుడు వినాయక్ చాలా ఏళ్లుగా పవన్ సినిమా కోసం చూస్తున్నాడు. ఆ మధ్య అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కానీ ఆదిలోనే ఆగిపోయింది..

సంపత్ నంది: గబ్బర్ సింగ్ 2 సినిమాకు దర్శకుడిగా సంపత్ నందిని అనౌన్స్ చేసాడు పవన్ కళ్యాణ్. రచ్చతో హిట్ కొట్టిన ఈయనకు పవన్ ఛాన్సిచ్చాడు. కానీ అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది.

ఎస్‌జే సూర్య, పవన్: కాటమరాయుడు కంటే ముందు ఎస్‌జే సూర్యతో ఓ సినిమా ప్రారంభించాడు పవన్. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయింది.

నీసన్, పవన్ కళ్యాణ్: నీసన్ దర్శకత్వంలో తమిళనాట హిట్టైన వేదాళం సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు పవన్. ఓపెనింగ్ కూడా చేసిన తర్వాత ఈ సినిమాను ఆపేసారు.

ఖుషీ 2: చాలా ఏళ్లుగా ఖుషీ 2 చేయాలనుకుంటున్నాడు పవన్. ఆ మధ్య చెప్పాడు కూడా చేస్తానని. కానీ ఇప్పటికీ రాలేదు.. ఇంకపై వస్తుందనే నమ్మకం కూడా లేదు.

 

More Related Stories