ఆదివాసీల పాటకు పవర్ స్టార్ ఫిదా Pawan Kalyan
2020-12-24 15:16:03

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివాసీల పాటకు ఫిదా అయ్యారు. వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ సమయంలో విరామం రావడంతో ఆయన అక్కడున్న  అధివాసీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ మహిళ తమ మాతృ భాషలో ఓ పాట పాడింది. ఆ పాట ఎంతో నచ్చిందని పవన్ ట్వీట్ చేసారు. "నిన్న వకీల్ సాబ్ షూటింగ్ విరమంలో, అరకు ఆదివాసీల ఆంధ్ర-ఒరియా లో అడవితల్లి తో ముడిపడ్డ వారి జీవన పరిస్థితుల్ని వివరిస్తూ పాడే పాట. వింటుంటే "బిబూతి భూషణ్ బందోపాధ్యాయా రచించిన "వనవాసి" గుర్తుకువచ్చింది" అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

కాగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదివాసీలతో కలిసి కూర్చుని కాసేపు సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ నగిస్తున్న వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంతే కాకుండా ఎస్ఎస్ తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు. బాలీవుడ్ లో పింక్ సినిమాకు రీమేక్ గా " వకీల్ సాబ్" ను తెరకెక్కిస్తున్నారు. అక్కడ మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

More Related Stories