పవన్ కల్యాణ్, చిరంజీవి.. ఓ సినిమా పొలిటికల్ స్టోరీ.. Pawan kalyan
2019-12-18 10:56:14

ఇప్పుడు ఇదే అనిపిస్తుంది చూస్తుంటే. అన్నాదమ్ములు ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావడం లేదు. కొన్ని రోజులు అన్నయ్య రాజకీయాలంటాడు.. మరికొన్ని రోజులు తమ్ముడు రాజకీయం అంటాడు. ఎప్పుడు ఎవరెక్కడ ఉంటారో అంత ఈజీగా అర్థం కావడం లేదు. ఇఫ్పుడు మెగాస్టార్ పూర్తిగా సినిమాల్లోకి వచ్చేసాడు. పవన్ రాజకీయాల్లో ఉన్నాడు. సినిమాల్లో అవసరం అనుకున్నప్పుడు క్యారెక్టర్స్ చేంజ్ అవుతుంటారు కదా. ఇప్పుడు నిజజీవితంలో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇదే చేస్తున్నారు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. కాస్త ఆలోచిస్తే ఇందులో మర్మం కూడా అర్థం అవుతుంది. మొన్నటి వరకు చిరంజీవి రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. తొమ్మిదేళ్ల పాటు తనకు అలవాటు లేని రంగంలోనే ఉన్నాడు మెగాస్టార్. అందులో రెండేళ్లు కేంద్రమంత్రిగా.. ఐదేళ్లుగా ఎంపిగానూ ఉన్నాడు చిరంజీవి. తాను సాధించాలి అనుకున్న విజయాలు రాజకీయాల్లో అందుకోలేకపోయాడు ఈ హీరో. 

అందుకే అది తనకు కలిసి రావట్లేదని మళ్ళీ సినిమాల్లోకి వచ్చాడు అన్నయ్య. వ‌చ్చీ రాగానే ఖైదీ నెంబర్ 150 సినిమాతో సంచలనం సృష్టించాడు. సైరా సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులకు మంచి విందే ఇచ్చాడు. ఇప్పుడు ఇక రాజకీయాలకు పూర్తిగా సెలవు ఇచ్చేశాడు మెగాస్టార్. తనకు సినిమాలు చాలు అని రాజకీయాలు వ‌ద్ద‌ని చెప్పకనే చెబుతున్నాడు. ఇదే సమయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం పూర్తిగా రాజకీయాలతోనే కాలం గడిపేస్తున్నాడు. ఇప్పుడు సినిమాలు చేసే మూడ్ లో అసలు లేడు. జనేసన దారుణంగా ఓడిపోయినా కూడా ఇంకా జనాల్లోనే కనిపిస్తున్నాడు పవర్ స్టార్. తనకు సినిమాల కంటే కూడా జనమే ముఖ్యం అంటున్నాడు. ఇప్పుడు కాకపోతే వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తాను కానీ ఇలా నోరు మూసుకుని ఇంట్లో మాత్రం కూర్చోనంటున్నాడు పవన్ కల్యాణ్. 

సినిమాల్లో కొండంత క్రేజ్ ఉన్నా కూడా అవన్నీ వదిలేసి రాజకీయాల్లోనే ఉంటున్నాడు. నిర్మాతలు కోట్ల ఆఫర్ లు ఇస్తున్నా కూడా పవన్ మాత్రం రాజకీయాలు కావాలంటున్నాడు. ఈయన మనసు మార్చుకునేలా కనిపించడం లేదు. జనసేనతోనే తన ప్రయాణం అంటున్నాడు పవర్ స్టార్. పింక్ సినిమా రీమేక్ లో నటించడానికి ఈయన ఓకే చెప్పాడని వార్తలు వినిపిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆయన నోటి నుంచి అయితే ఆ మాటలు వినిపించలేదు. మరోవైపు దిల్ రాజు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ వేగంగా చేస్తున్నాడు. కానీ పవన్ మాత్రం మొన్న ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా పార్టీని వీడటం లేదు. ఇప్పట్నుంచే పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు పవర్ స్టార్. మొత్తానికి అప్పుడు అన్నయ్య రాజకీయాల్లో ఉంటే ఇప్పుడు తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు. అప్పుడు తమ్ముడు సినిమాల్లో బిజీగా ఉంటే ఇప్పుడు అన్నయ్య ఆ బాధ్యత తీసుకున్నాడు. ఈ మెగా బ్రదర్స్ దారి భలే ఉందిప్పుడు. 

More Related Stories