పవన్ వారసుడి తెరంగ్రేటం.. ప్లాన్ అదుర్స్ Pawan Kalyan
2020-02-14 00:38:10

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ వేరు పడిన సంగతి తెలిసిందే. అయితే వారి పిల్లలి అకీరా, ఆద్యలు మాత్రం మెగా ఫ్యామిలీ మనుషుల లానే కలిసిపోతుంటారు. ఏ సెలెబ్రేషన్స్ జరిగినా వీరిద్దరు ఖచ్చితంగా వస్తున్నారు. అయితే ఇన్నాళ్లు పుణెలో ఉన్న అకీరా, ఆద్యలు హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయ్యారనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. రేణు దేశాయ్‌ పుణెలో ఉండటం చేత పవన్ నుండి వేరుపడిన ఆమె ఆమె అక్కడికి వెళ్లి స్థిరపడింది. అయితే గత కొన్ని రోజులుగా రైతు సమస్యల మీద సినిమా చేస్తున్న ఆమె ప్రీ ప్రొడక్షన్‌లో భాగంగా రేణు దేశాయ్ హైద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగాలసి వస్తోంది.

ఇక పూర్తిగా సినిమాల మీదే ద్రుష్టి పెట్టాలనుకున్న ఆమె పుణె వదిలి హైదరాబాద్ షిఫ్ట్ అయినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన పవన్ తన పిల్లలు మాజీ భార్య ఉండేందుకు ఓ విలాసవంతమైన బంగ్లా కొనిపెట్టాడట. అన్ని వసతులతో కూడిన ఓ విలాసవంతమైన బంగ్లాను అకీరా, ఆద్యలకు పవన్ బహుమతిగా ఇచ్చాడని అంటున్నాఋ. ఇక అకీరాకి నటనలో శిక్షణ కూడా ఇప్పిస్తారని త్వరలోనే తెరంగ్రేటం కూడా చేయించేయవచ్చని అంటున్నారు.  

More Related Stories