ఇప్పటికే రికార్డులు బద్దలు...ఆరోజు పవన్ ఫ్యాన్స్ ని ఆపగలమా అసలు Pawan Kalyan
2020-08-17 17:54:34

"నేను ట్రెండ్‌ను ఫాలో కాను ట్రెండ్‌ సెట్ చేస్తా " అని గబ్బర్ సింగ్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెబుతాడు. ఇప్పుడు ఆ డైలాగ్ ను నిజమయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2వ తేదీన ఉండగా ఇప్పటి నుంచే జనసేనానికి అడ్వాన్స్ బర్త్‌డే విషెస్‌ అందుతున్నాయి. అదేంటి అనుకుంటున్నారా ? నిజానికి తమ తమ అభిమాన హీరోల పుట్టినరోజులప్పుడు టీజర్, ట్రైలర్ రిలీజ్ రోజున ట్రెండ్స్ క్రియేట్ చేయడం రివాజు. అయితే ఇంకా సమయం ఉండగానే సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులు తమదైన రీతిలో వినూత్న పద్దతిలో వీడియో పోస్టింగులు పెడుతూ గబ్బర్‌సింగ్‌‌కు అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. 

అలా నిన్న ట్వీట్ల రూపంలో సునామీ సృష్టించారు. నేషనల్ వైడ్ గానే కాక ఇంటర్నేషనల్ వైడ్ గా ట్రెండింగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు పవర్ స్టార్ ఫ్యాన్స్. 'పవన్ బర్త్ డే కామన్ డీపీ హ్యాష్ ట్యాగ్'తో ప్రపంచంలోనే అత్యధిక ట్వీట్ల ట్రెండ్‌ను ఆయన పేరిట నమోదు చేశారు. #PawankalyanBirthdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా 24 గంటల్లో 65 మిలియన్ ట్వీట్లు చేసి సరికొత్త రికార్డును నెలకొల్పారు. 

ఇక కామన్ డీపీ కోసమే ఆయన ఫ్యాన్స్ ఇంత హంగామా సృష్టిస్తే సెప్టెంబర్ 2న ఆయన పుట్టిన రోజున పవన్ ఫ్యాన్స్ ఎంత హంగామా ఎలా ఉంటుందో ? ఇక సినిమాల విషయానికి వస్తే ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ 20 రోజుల షూట్ పెండింగు ఉంది. ఇక మ‌రోవైపు క్రిష్ సినిమా.. హ‌రీష్ సినిమాల‌ను కూడా ఒప్పుకున్నా పవన్ 2021దాక సెట్స్ కెళ్లే వీలు లేదని చెబుతున్నారు.  
 

More Related Stories