ఎంగేజ్మెంట్ కి పవన్ డుమ్మా...దానికి టైం ఉంటుందా.. Pawan Kalyan
2020-08-14 21:46:39

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో మారు చర్చనీయాంశం అయ్యాడు. నిజానికి నిన్న మెగా సోదరుల్లో రెండో వాడు, పవన్ అన్న అయిన నాగబాబు కుమార్తె నిహారిక ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుక కరోనా కారణంగా చిన్నగా జరుపుకున్నారు. అయితేనేమి మెగా ఫ్యామిలీ నుండి దాదాపుగా అందరూ వచ్చి ఆ జంటను ఆశీర్వదించారు ఒక్క పవన్ తప్ప. నిజానికి పవన్ మెగా ఫ్యామిలీలో ఎక్కువ కలవడు అనే టాక్ వినిపిస్తోంది. 

అందుకు తగ్గట్టే ఈయన కూడా ఇలాంటి వేడుకలప్పుడు అస్సలు కనిపించడు. అయితే ఇది మామూలే కదా, అయినా వచ్చి ఉంటే బాగుండేది అని ఫ్యాన్స్ సమాధానపరచుకుంటుంటే కొందరు మాత్రం నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కి వెళ్ళడానికి టైం ఉంటుంది కానీ సొంత అన్న కూతురు ఎంగేజ్మెంట్ కి రావడానికి టైం లేదా అని ప్రశ్నిస్తున్నారు.
 
ఇక మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది . నిహారిక - చైతన్యల నిశ్చితార్థం నిన్న రాత్రి 8 గంటలకు హైదరబాద్‌లో జరిగింది. కోవిడ్ నిబంధనలతో కేవలం కొద్దిమంది ఫ్యామిలీ సభ్యులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. అయితే నిశ్చితార్థానికి పవన్ కళ్యాణ్ మినహా మెగా హీరోలంతా హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు.

More Related Stories