మలయాళ రీమేక్ లో పవన్ కళ్యాణ్  Pawan Kalyan
2020-05-13 13:20:10

చిరంజీవి కొడుకు రామ్‌చరణ్‌ ఒకపక్క హీరోగా బిజీగా ఉంటూనే మరో పక్క నిర్మాతగా మారి సినిమాలు చేస్తున్నారు. చిరు సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన కోసం కథలు రెడీ చేయడం మొదలు ఆ కథలకు తగ్గ దర్శకుల్ని లైన్ లో పెట్టడం వరకూ అన్నీ చరణే చూసుకుంటున్నారు. ఆచార్య ఇప్పటికే లైన్ లో ఉండగా, లూసిఫర్‌ రీమేక్‌ కూడా తెరకెక్కనుంది. అయితే ఆయన ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ అనే మరో మలయాళ చిత్ర రీమేక్‌ హక్కులు కొన్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇది తన బ్యానర్‌లోనే వెంకటేష్ తో కలిసి చేయనున్నట్టు గుసగుసలు వినిపించాయి. అయితే అదేమీ లేదని తేల్చేశారు. 

2019లో మలయాళంలో వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా దక్కిడంతో ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో మరో స్టార్ ప్రొడ్యూసర్ కొన్నారట. ఆ నిర్మాత తాజాగా పవన్ కళ్యాణ్ ని డ్రైవింగ్ లైసెన్స్ మూవీ చూడమని కోరాడట. ఆయన ఒప్పుకుంటే ఈ ప్రాజెక్ట్ ఆయనే హీరోగా పట్టాలెక్కచ్చని అంటున్నారు. లాల్ జూనియర్ తెరకెక్కించిన ఈ సినిమాలో పృథ్వి రాజ్ హీరోగా, నటుడు సూరజ్ కీలక పాత్ర చేశారు. ఓ సూపర్ స్టార్ కి అతని అభిమాని అయిన ఆర్టిఓ ఆఫీసర్ కి మధ్య జరిగే ఆసక్తి కర్ర ఈగో వార్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ సూపర్ స్టార్ పాత్రలో నటించావచ్చని అంటున్నారు. 

More Related Stories