క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని కలిసిన పవన్Pawan Kalyan
2021-03-10 15:16:00

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కునున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పవన్ కల్యాణ్ సినిమాలకంటే తన సేవా గుణం..మంచి మనసు తోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నోసార్లు పవన్ కష్టాల్లో ఉన్న  తన అభిమానులను ప్రత్యక్షంగా వెళ్లి కలిశారు. ఇక తాజాగా పవన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమానిని వెళ్లి కలిశారు. కృష్ణా జిల్లాలోని లింగాల గ్రామంలో పవన్ కళ్యాణ్ అభిమాని భార్గవ 19 క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దాంతో భార్గవ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ నడవలేని స్థితిలో ఉన్న భార్గవ వద్దకు వెళ్లి కలిశారు. చేస్తులెత్తి నమస్కరించి ఆప్యాయంగా పలకరించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భార్గవ కుటుంబ సభ్యులతో పవన్ కల్యాణ్ మాట్లాడి వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందజేశారు. అంతే కాకుండా గణేశుడి వెండి ప్రతిమను సైతం పవన్ కళ్యాణ్ అభిమానికి ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ని చూసిన ఆనందం నూతన ఉత్తేజం తో తమ కుమారుడి ఆరోగ్యం మెరుగుపడుతుందని భార్గవ తల్లి తండ్రులు ఆశిస్తున్నారు.

More Related Stories