పవన్ కళ్యాణ్ తో బండ్ల సినిమా..నిజమెంత



 Pawan Kalyan
2020-11-24 13:11:21

టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తనతో సినిమాకు ఒకే చెప్పారని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్..బండ్ల గణేష్ కాంబినేషన్ లో సినిమా వస్తుందనడంలో నిజం లేదట. బండ్ల గణేష్ కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే పవన్ తో సినిమా చేస్తున్నానని ప్రకటించారయట. ఇదిలా ఉండగా యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ హీరోగా "తీన్ మార్" సినిమా కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ను నష్టాల్లో నుండి కాపాడేందుకు మరోసారి సినిమా తీసేందుకు ఒప్పుకున్నారు.

 ఆ సినిమానే "గబ్బర్ సింగ్". హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో బండ్ల గణేష్ ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగి పోయారు. ఆ తరవాత మరిన్ని సినిమాలు తీసినప్పటికీ పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో మరోసారి పవన్ తోనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యాడేమో బండ్ల అందుకే పవన్ ఒకే చెప్పకముందే సినిమా తిస్తున్నామని ప్రకటించాడు. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ సినిమాల తో పాటు రాజకీయాల్లో కూడా రాణించాలనుకుని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించినప్పటికి ఆ ఆశ నెరవేరలేదు. దాంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాలపైనే దృష్టి పెట్టారు.

More Related Stories