పవన్ కళ్యాణ్, రవితేజ కాంబినేషన్లో క్రేజీ మల్టీస్టారర్..pk
2020-04-05 14:18:34

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాలు చాలా వస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోలు కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కథ బాగుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్, రవితేజ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను కాటమరాయుడు, గోపాల గోపాల దర్శకుడు డాలి తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది. తమిళనాట సూపర్ హిట్ అయిన ఒక సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు ఈయన. ఇప్పటికే ఈ కథకు మార్పులు చేర్పులు చేయడం మొదలుపెట్టాడు డాలి. పవన్ కళ్యాణ్ రవితేజ ఇమేజ్ సరిపోయే ఈ విధంగా తెలుగులో కొన్ని మార్పులు చేస్తున్నాడు ఈ దర్శకుడు. పవన్ కళ్యాణ్ స్నేహితుడు రామ్ తాళ్ళూరి దీనికి నిర్మాత. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మల్టీస్టారర్ రాబోతుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఇందులో రవితేజ నేల టికెట్ సినిమా చేశాడు. మొన్నటికి మొన్న డిస్కోరాజా కూడా ఇదే బ్యానర్ లో వచ్చింది. ఇక ముచ్చటగా మూడోసారి ఇప్పుడు ఇందులో సినిమా చేయబోతున్నాడు రవితేజ. పవన్ కళ్యాణ్ ఇదివరకే వెంకటేష్ కలిసి గోపాల గోపాల సినిమాలో నటించాడు. ఇప్పుడు రవితేజతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. పేరుకు తమిళ రీమేక్ అయినా కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కేవలం లైన్ మాత్రమే తీసుకొని మిగిలిన కథ మొత్తం కొత్తగా రాసుకుంటున్నాడు డాలి. మొత్తానికి ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్ అయితే పవన్, రవితేజ అభిమానులకు అంతకంటే కావల్సింది మరొకటి లేదు.

More Related Stories